Breaking News

ఎట్టకేలకు మౌనం వీడిన మౌనీ రాయ్.. నాలుగేళ్లకే గుడ్‌ బై

Published on Thu, 05/14/2026 - 19:27

అనుకున్నదే జరిగింది. గత రెండు రోజులుగా వస్తోన్న రూమర్సే నిజమయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభిమానులను కోరింది. విడాకుల విషయాన్ని మౌనీరాయ్‌తో పాటు ఆమె భర్త సూరజ్ నంబియార్‌ సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెళ్లైనా నాలుగేళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు.

తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో, పరస్పర గౌరవంతో విడిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.  పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. స్నేహపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే విడిపోయినప్పటికీ భవిష్యత్తులో స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

తమ వ్యక్తగత జీవితాలపై మీడియా అత్యుత్సాహంపై మౌనీ రాయ్ దంపతులు మండిపడ్డారు. తమ ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను, కల్పిత కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రిలేషన్‌ గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఈ కష్ట కాలంలో తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమ గోప్యతను గౌరవించాలని అభిమానులను విజ్ఞప్తి చేశారు.

కాగా.. మౌని రాయ్,  సూరజ్ నంబియార్ జనవరి 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో డివోర్స్ రూమర్స్ మొదలయ్యాయి. మౌని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సూరజ్‌తో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు కనిపించడం లేదని అభిమానులు విడాకుల చర్చకు దారితీసింది.

ఇక మౌనీ రాయ్ సినీ కెరీర్ విషయానికొస్తే 'కస్తూరి', 'దేవోం కే దేవ్...మహాదేవ్', 'నాగిన్' వంటి సీరియల్స్‌తో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా  'నాచ్ బలియే 6', 'ఝలక్ దిఖ్లా జా 7', 'జరా నాచ్కే దిఖా' వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది. ఇటీవలే 'టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా'కు హోస్ట్‌గా వ్యవహరించింది.  'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ', గోల్డ్, మేడ్ ఇన్ చైనా లాంటి చిత్రాల్లో కూడా నటించింది.

 

 

Videos

జగన్ కోసం పోటెత్తిన జనం.. ఎక్కడికి వెళ్లినా జన సునామి

దుబారాలో మనమే టాప్.. బాబు.. లోకేష్ జల్సాలు

బుల్డోజర్ కింద బైకులు పిండి పిండి

జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్

లోకేష్ జల్సాలు..స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి..భారీ కాన్వాయ్ లో చక్కర్లు

2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్

YSRCPలో చేరిన తరువాత మోపిదేవి శ్రీనివాసరావు ఫస్ట్ రియాక్షన్

తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు

మోపిదేవికి జగన్ హామీ..

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు

Photos

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా నీలమ్మ తల్లి పండుగ (ఫొటోలు)

+5

ఫారిన్ వెకేషన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. (ఫోటోలు)

+5

కేన్స్ వీధుల్లో మెగా డాటర్ నిహారిక సందడి.. (ఫోటోలు)

+5

పొలిటికల్‌ స్టైల్‌ షో.. ఈ అదిరే లుక్స్‌ చూశారా?..

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన నటి ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)

+5

చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)

+5

‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)