అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
టాలీవుడ్‌కి బిగ్‌షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది
Published on Wed, 05/13/2026 - 10:29
తెలుగు సినీ పరిశ్రమకు బిగ్ షాక్ తగిలింది. ఒకప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టి, వదిలి వెళ్లిపోయిన పైరసీ బూతం ‘ఐబొమ్మ ’మళ్లీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో కనినిపిస్తున్నాయి. ఈ సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ కావడంతో ఇక ఈ సమస్య తీరిపోయిందని భావించిన సినీ పెద్దలకు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి.
కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, కీలక సూత్రధారిగా భావిస్తున్న రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఐబొమ్మ తన డొమైన్లను మార్చుకుంటూ మళ్లీ రంగ ప్రవేశం చేసింది. థియేటర్లలో ఉన్న తాజా చిత్రాలు, ఓటీటీలో విడుదలైన కొత్త కంటెంట్ ఈ సైట్‌లో ప్రత్యక్షమవుతుండటంతో సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకుడు బెయిల్‌పై ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ యాక్టివ్ అవ్వడం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు.
Tags : 1