విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
Breaking News
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్‌పై సస్పెన్స్
Published on Wed, 05/06/2026 - 23:32
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్‌గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్‌లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది.
తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్‌లో మూడో లుక్‌ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్‌లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్‌లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది.
‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Tags : 1