Breaking News

మళ్లీ మొదలైన యుద్ధం: గ్లోబల్ మార్కెట్‌పై ఎఫెక్ట్!

Published on Tue, 05/05/2026 - 08:13

గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.

యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.

ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.

మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్‌ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.

భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.

ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

Videos

ఫ్యామిలీతో విజయ్ సెలబ్రేషన్స్

ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం..

DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు

గెలిచిన చోట విజయ్ రాజీనామా..

తమిళ రాజకీయాల్లో కొత్త శక్తి..!

10 సీట్లు కోసం.. ఆ పార్టీతో TVK పొత్తు..?

CM పదవికి స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ కు లేఖ

విజయ్ పై తల్లి, ఫ్యామిలీ అద్భుతమైన పాట

రానున్న 24 గంటల్లో హర్మూజ్ జలసంధిలో ఏం జరగబోతోంది

ఆ దమ్ము.. ఆ ఫైర్, పవన్ లో ఎందుకు లేదు..

Photos

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)

+5

ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు మనవరాలి వివాహం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)