Breaking News

విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు

Published on Mon, 05/04/2026 - 18:47

విజయ్ గెలుపుతో కోలీవుడ్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్‌ సైతం విజిల్స్‌తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్‌ను అభినందించారు. 

టాలీవుడ్ హీరోల ప్రశంసలు..

దళపతి విజయ్‌కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.  మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి  ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్‌బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్‌ విజయంపై ట్వీట్ చేశారు.

కాజల్ అగర్వాల్ ట్వీట్..

తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన  విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా  చెప్పారని ప్రశంసించింది.  ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ,  మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. 

TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు
 

 

 

 

 

Videos

ఎన్ని అవమానాలు వచ్చినా.. రజిని.. కమల్ కానిది విజయ్ సాధించాడు

చెన్నైలోని తల్లిదండ్రుల నివాసంలో TVK విజయ్ దృశ్యాలు

పవర్ పోయింది.. దీదీ పాలనకు చరమగీతం..

Axis My India చెప్పిందే నిజమైంది.. విజయ్ విజయ దుందుభి

TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు

MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి

విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న

సినిమా నుంచి CM వరకు.. విజయ్ ప్రస్థానం

రియల్ జన నాయగన్, పార్టీ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు..

పొత్తుల్లేవు... జెండాలు మోసే కూలి కాదు విజయ్ తిరుగులేని ప్రస్థానం

Photos

+5

ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు మనవరాలి వివాహం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)