Breaking News

వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?

Published on Tue, 04/28/2026 - 18:02

జార్ఖండ్‌లో జరిగిన విషాద ఘటన అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.దాంతో సమ్మర్‌లో ఎలాంటి చిరుతిండ్లు మంచివనే చర్చలు లేవనెత్తాయి. అందులోనూ స్ట్రీట్‌ ఫుడ్స్‌ విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అందరు మెచ్చే పానీపూరి విషయంలో మరింత కేర్‌ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జార్ఖండ్‌ గిరిడిహ్ జిల్లాలోని లేడా బజ్తో గ్రామంలో, శనివారం సాయంత్రం ఒక వీధి వ్యాపారి అమ్మిన పానీపూరీలు తిని చాలామంది వాంతులు, నీరసం వంటి అనారోగ్యం బారిన పడ్డారు. సుమారుగా 18 మందికి పైగా ఆసుపత్రిలో చేరగా, ఏడేళ్ల చిన్నారి మరణించింది. ఒక సాధారణ వీధి ఆహారం ఇంత మందికి ప్రాణాంతకంగా ఎలా మారిందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణంగా దానిలో ఉపయోగించే నీరేనని వైద్యులు చెబుతున్నారు. 

పానీపూరీ అనగానే నీరు ప్రధానం. ఈ నీరు కలుషితం కాకుండా మంచి పరిశుభ్రమైనది వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అదే నీరు కలుషితమైతే దానిలో కోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందన్నారు. వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురవ్వుతామని అన్నారు.  

అలాగే అందులో ఉపయోగించే కూరలోని బంగాళదుంపలు, శనగులు తాజాగా ఉంటే పర్లేదు గానీ, అవి కూడా అసురక్షితమైనవి అయితే  ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుతుందన్నారు. అలాగే దుకాణం వద్ద కూడా పరిశుభ్రత అనేది అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమ్మకందారులు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పాత పాత్రలనే వాడటం, ఈగలు, దుమ్ముకు గురికావడం, తదితరాల వల్లే ఫుడ్‌పాయిజనింగ్‌ అయ్యి అనారోగ్యం బారిన పడతారని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

కొన్నిసార్లు, హాని కలిగించేవి కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అవి వదిలిపెట్టే విషపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలు వస్తయాన్నారు. ఆ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే విషపదార్థాల కారణంగా డీహైడ్రేషన్, అవయవాలపై ఒత్తిడి, చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుందని అంటున్నారు. వేసవిలో వేడి కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగవంతంగా ఉంటుందట. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగ ఫుడ్‌పాయిజన్‌ కేసులు నమోదవుతాయని అంటున్నారు నిపుణులు. దకాణాదారుడు పరిశుభ్రతను పాటిస్తూ..నాణ్యమైన పదార్థాలనే ఉపయోగిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా తినొచ్చని అన్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?)

 

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)