Breaking News

ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే వేల కోట్ల కలెక్షన్స్

Published on Mon, 04/27/2026 - 13:30

ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు దాన్ని చూసేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ మైఖేల్ జాక్సన్ బయోపిక్ విషయంలో మాత్రం ఇది రివర్స్‌లో జరిగింది. పదో వందో కాదు ఏకంగా మూడు రోజుల్లోనే వేలకోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది చూసి, బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రేంజు అభిమానమా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ 'మైఖేల్' మూవీ సంగతేంటి? తొలి వీకెండ్ వసూళ్లెంత?

(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)

ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని షేక్ చేసిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా 'మైఖేల్'. ఇందులో మైఖేల్ జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశాడు. చిన్నాన్న డ్యాన్సుల దగ్గర నుంచి స్టైల్ వరకు ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్లు దింపేశాడు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు.. మూడు రోజుల్లోనే $217.4 మిలియన్ల కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.

భారతీయ కరెన్సీ ప్రకారం వసూళ్లు మొత్తం రూ.2049 కోట్లు. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్ రికార్డ్ ఇదివరకు 'ఓపెన్ హైమర్' పేరిట 180.4 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు దీన్ని అధిగమించిన 'మైఖేల్'.. గ్లోబల్ వైడ్ సరికొత్త ఘనత సాధించింది. అయితే విడుదల ముందు రోజు ప్రీమియర్లు వేస్తే చూసిన చాలామంది.. 'మైఖేల్' బయోపిక్ అంతేం మెప్పించలేదని పెదవి విరిచారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్ అభిమానులు మాత్రం ఆయన్ని చివరిసారి బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇక్కడ అక్కడ తేడా లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాని చూస్తున్నారు.

అయితే 'మైఖేల్' పేరుతో రిలీజైన ఈ సినిమాలో పాజిటివ్ యాంగిల్ మాత్రమే చూపించారు. వివాదాల జోలికి పోలేదు. అలానే కథని మధ్యలోనే ఆపి, సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఈ రెండో భాగం ఎప్పుడొస్తుందనేది చూడాలి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

Videos

కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్

ఘోర ప్రమాదం కార్మికులపై కూలిన క్రేన్

TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్

కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే..? బూడిదైన కార్లు..!

శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!

పోలీస్ వ్యవస్థ బతికే ఉంటే రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకోవాలి

కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్లు.. లక్షకు 5 లక్షలొచ్చాయ్..

తేజస్వీ సూర్య ఒక వెదవ

అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Photos

+5

‘వదలా’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్‌ (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)

+5

ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)

+5

‘ఏక్‌ దిన్‌’ మూవీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో సాయి పల్లవి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్‌ ఈవెనింగ్‌ (ఫొటోలు)

+5

హనీ ఈజ్‌ ది బెస్ట్‌.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్‌ (ఫోటోలు)

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)