Breaking News

సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు

Published on Sun, 04/26/2026 - 15:27

ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమాల్లో మాత్రమే అని కాకుండా వెబ్ సిరీస్‌లతోనూ చిన్న చిన్న నటీనటులకు అవకాశాలు దొరుకుతున్నాయి. అలానే ఓ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ యువనటి అనుగ్రహ నంబియార్.. షూటింగ్ సందర్భంగా తనకెదురైన ఇబ్బందుల గురించి, హీరో అతడి భార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది)

కేరళకు చెందిన 23 ఏళ్ల నటి అనుగ్రహ ఎస్ నంబియార్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 'అడిపోలి' అనే మూవీ కూడా చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో వారం వారం ప్రసారమవుతున్న 'రిసార్ట్' ‍అనే వెబ్ సిరీస్‌లో శ్రీనిధి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో దాదాపు 6 నిమిషాల వీడియోని అనుగ్రహ పోస్ట్ చేసింది.

'సిరీస్ కోసం అగ్రిమెంట్‌పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. మరే సినిమాల్లోనూ నటించొద్దని చెప్పారు. దీంతో గత నాలుగు నెలలుగా పనిలేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్లు వీళ్లు అని తప్పించుకుంటున్నారు. నేను చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా కలలు అడ్డుకోవడానికి మీకెవరికీ హక్కు లేదు'

'ఇంకా చెప్పాలంటే షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. సరైన భోజనం కూడా పెట్టలేదు. పారితోషికం గురించి అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో కూడా చేరాను. తన పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. నేను ఆస్పత్రిలో చేరితే విజయ్ నిర్లక్ష్యంగా స్పందించాడు. తనపై విజయ్, అతడి భార్య నక్షత్ర అనుచితంగా మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఈ వ్యవహారంపై నిర్మాతలు, సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను' అని అనుగ్రహ చెప్పుకొచ్చింది. సిరీస్ దర్శకనిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

(ఇదీ చదవండి: రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి)

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)