ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?
Published on Sat, 04/25/2026 - 20:13
చిన్న చిన్న హీరోల సినిమాలకు ఇబ్బందులు వచ్చాయంటే ఏదో అనుకోవచ్చు. స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి మూవీకి, అది కూడా ఇంకా మొదలవకముందే వస్తున్నాయంటే ఏమనుకోవాలి? ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' మూవీతో హిట్ కొట్టిన చిరు.. లెక్క ప్రకారం డైరెక్టర్ బాబీతో ఈ పాటికే కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టేయాలి. కానీ ఎక్కడో సమస్యలు ఈ చిత్రానికి చుట్టుకుంటున్నాయి. దీంతో నిర్మాత విషయంలో లేనిపోని టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?
(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)
తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'జన నాయగణ్' తీసిన నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఈ సినిమాతో బోలెడన్ని లాభాలు అందుకోవచ్చని ఆశపడ్డారు. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి.
మరోవైపు కన్నడ స్టార్ హీరో యష్‌తో ఈయనే 'టాక్సిక్' నిర్మించారు. ఇది కూడా మార్చిలోనే విడుదలవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల జూన్ 4కి వాయిదా పడింది. మరోవైపు ఈయనే నిర్మించిన 'కేడీ' అనే పాన్ ఇండియా సినిమాలోని పాట, కొన్నిరోజుల ముందు వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ట్రైలర్ కూడా ఇలాంటి సమస్యే ఎదురవగా యూట్యూబ్ నుంచి తీసేశారు. ఇలా లెక్కకు మించిన సమస్యల కారణంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఇన్ని ఇబ్బందులు ఉండటంతో చిరు-బాబీ చేయాల్సిన కొత్త ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. చిరు సినిమా నుంచి కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతగా తప్పుకొందని కొందరు అంటున్నారు. లేదు లేదు ఈయనతో పాటు మరో నిర్మాత కావాల్సి ఉందని రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్లే చిరు తెలిసిన ఓ నిర్మాత.. ఈ మూవీ విషయంలో భాగస్వామిగా మారబోతున్నాడని మరో టాక్ వినిపిస్తుంది. ఏదో ఒకటి త్వరగా దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో స్టార్ హీరో సర్జరీ.. రిస్క్ చేశాడా?)
Tags : 1