ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
కుటుంబ జీవితం, కెరీర్ ప్లాన్‌పై సింగపూర్ మాజీ ప్రధాని సలహా!
Published on Sat, 04/25/2026 - 16:29
వివాహం, పిల్లలు కనడం గురించి ఇటీవల కొందరు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు యువత కెరీర్, మంచిగా సెటిల్ అవ్వడమే ప్రధానం అనుకునేవాళ్లను ప్లీజ్ అలా ఆలోచించద్దు అని బతిమాలుతున్నారు. ఫ్యామిలీ లైఫ్‌కే ప్రాధాన్యత ఇవ్వండని వేడుకుంటున్నారు. ఆ దిశగా ఆలోచించేలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు సింగపూర్ మాజీ ప్రధాని సైతం సలహలిస్తుండటం విశేషం. అందుకు సంబధించిన వీడియోని షేర్ చేస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కూడా ఆయన మాటలకే మద్దతిస్తూ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు.
శ్రీధర్ వెంబు షేర్ చేసిన ఎక్స్ పోస్ట్‌లో సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ యువతకు సలహాలిస్తున్నారు. ప్లీజ్ వివాహాన్ని, కుటుంబాన్ని ప్రారంభించడాన్ని ఆలస్యం చెయ్యొద్దు అని ఒక పీహెచ్డీ విద్యార్థికి సలహా ఇస్తున్నారు. ఆ వీడియోలో లీ ఆమె విద్యా ప్రణాళికలను ప్రశ్నిస్తూ, కుటుంబ నిర్ణయాలను వాయిదా వేయకూడదని సూచిస్తున్నారు. మాజీ ప్రధాని లీ ఆ విద్యార్థిని వ్యక్తిగత విద్యా జీవితం గురించి వరుసగా ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. ఆమెకు పెళ్లయిందా, బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా, పీహెచ్డీ ఎప్పుడు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా అంటే ప్రశ్నిస్తారు.
ఆమె సుమారు రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేస్తుందని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ విద్యార్తి నేరుగా సలహా ఇచ్చారు. “దయచేసి సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ జీవితం మీ పీహెచ్డీ కంటే ముఖ్యమైనది. సంతృప్తినిచ్చే జీవితం కూడా. మీకు ఇదే నా శుభాకాంక్షలు నీకు పీహెచ్డీ, మంచి బాయ్‌ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తున్నా అంటూ లీ ముగించారు. ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూ..శ్రీధర్ వెంబు తన ప్రారంభ సంవత్సరాల నుంచి లీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించానని అన్నారు. ఆయనపై తనకు ప్రగాఢమైన గౌరవం ఉందని పేర్కొన్నారు.
తాను ఇటీవల సంభాషణలలో ఇలాంటి సలహానే ఇచ్చానని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన, ఎలాన్ మస్క్ తరచుగా పంచుకునే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు. ఉన్నత ఆశయాలున్న మహిళలు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే, పిల్లలను కనేలా ప్లాన్ చేసుకోవలని చెబుతున్నారు శ్రీధర్వెంబు. మన సమాజ సాంస్కృతిక, ఆర్థిక నిర్మాణాలు సర్దుబాటు కావాలంటే కుటుంబ వ్యవస్థ ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. కాగా, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక ప్రాధాన్యతల కారణంగా చాలామంది వ్యక్తులు వివాహాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆలస్యం చేస్తున్నారు.
తీరా కెరీర్లో సెటిల్ అయ్యాక..సంతానం కలుగక నరకం చూస్తున్నారు. అదే సమయంలో గతకాలంటే గణనీయంగా జననరేటు తగ్గిపోతోంది. దాంతో పలువురు వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తరాలను ఆ దిశగా ఆలోచించేలా సలహాలు సూచనలతో మేల్కొలుపుతున్నారు.
I studied the life and work of Lee Kuan Yew, the Founder-Prime Minister of Singapore intensely during my early 20s. Immense respect for him.
In this video clip, he advises a young woman pursuing a PhD not to neglect marriage and kids. I recently gave very similar advice.
Elon… https://t.co/BVlUSDsBnP— Sridhar Vembu (@svembu) April 24, 2026
(చదవండి: ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్ అవ్వాల్సిందే!)
Tags : 1