Breaking News

చాలా అసౌకర్యంగా అనిపించింది.. నో చెప్పాలనుకున్నా కానీ

Published on Fri, 04/24/2026 - 13:26

'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' సినిమాతో పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోయిన్ కాజోల్.. తర్వాత హీరో అజయ్ దేవగణ్‌ని పెళ్లి చేసుకుంది. ఇ‍ద్దరు పిల్లలకు తల్లయింది. అయినా సరే ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తోంది. మరోవైపు 'ద ట్రయల్' అనే సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ముద్దు సీన్లలో నటించకూడదనే పాలసీ పెట్టుకున్న ఈమె.. ఓటీటీ సిరీస్ కోసం దాన్ని పక్కనబెట్టేసింది. సహ నటుడితో కిస్ సీన్ చేసింది. ఇన్నాళ్లకు సదరు సన్నివేశం గురించి స్పందించింది. చేస్తున్నప్పుడే చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్‌ సీఎం అవుతాడు)

రీసెంట్‌గా ఓ యూట్యాబర్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాజోల్.. తాను ముద్దు సన్నివేశంలో నటించడానికి గల కారణాల్ని బయటపెట్టింది. 'అది కేవలం కిస్ సీన్ మాత్రమే కాదు. ఆ పాత్ర భావోద్వేగాలకు, ఆలోచనలకు ఎంతో కీలకం. దాన్ని తీసేస్తే పాత్రలోని డెప్త్ తగ్గిపోతుంది. కానీ ఆ సీన్ తీస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. స్టోరీ చెప్పినప్పుడు ఓకే చెప్పాను గానీ సెట్స్‌కి వెళ్లినప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది. చివరి నిమిషంలో 'ఇది చేయను' అని చెప్పాలనిపించింది. కానీ ఇది పూర్తిగా ప్రొఫెషనల్ నిర్ణయం అని భావించి చేశాను' అని చెప్పుకొచ్చింది.

'ద ట్రయల్' సిరీస్‌లో కాజోల్ లాయర్ పాత్ర చేసింది. ఇందులోనే ఓ సీన్‌లో భర్తగా నటించిన జీషూ సేన్ గుప్తాతో ముద్దు సీన్ చేసింది. అయితే 1992లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కిస్ సీన్ చేయకూడదని కాజోల్ తనకు తానుగా రూల్ పెట్టుకుంది. కానీ ఈ సిరీస్ కోసం చేసేసరికి అంతా ఆశ్యర్యపోయారు. ఈ సిరీస్ రెండో సీజన్ కూడా త్వరలో రిలీజ్ కానుంది.

కాజోల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. హీరో అజయ్ దేవగణ్‌ని ప్రేమించి 1999లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలున్నారు.

(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)

Videos

రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదవి..!

రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, సింగపూర్ లో షికారు చేస్తున్నాడు

జగన్ జగన్ అంటూ జపం నిద్రలో తండ్రీకొడుకు కలవరింతలు..!?

గుంటూరు కలెక్టరేట్ వద్ద రేపు భారీగా ధర్నా చేస్తాం

రాధాకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం..?

సెల్లెఫోన్ లైట్ల వెలుగులో రోగులకు వైద్యం

లారీ కింద పడిన దుప్పి ప్రాణాలు కాపాడిన స్థానికులు

12 కోట్లు ఎదురిచ్చి తప్పుకున్న ధురంధర్

24 గంటల్లో రెండు అత్యాచారాలు IRS అధికారి కూతురి కేసులో షాకింగ్ నిజాలు

భారీ నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Photos

+5

భార్యతో కలిసి ప్రియదర్శి హిమాలయ ట్రిప్ (ఫొటోలు)

+5

తండ్రికి శ్రీముఖి బర్త్ డే విషెస్ (ఫొటోలు)

+5

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు (ఫొటోలు)

+5

సతీమణితో శ్రీవారిని సేవలో డైరెక్టర్ బాబీ (ఫొటోలు)

+5

రెడ్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ (ఫొటోలు)

+5

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

గ్లామర్‌ క్వీన్‌ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌ (ఫోటోలు)

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)