ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్‌ ప్లాన్‌

Published on Wed, 04/22/2026 - 11:55

బరువు తగ్గడం ఇటీవల కాలంలో ఓ క్రేజీ ట్రెండ్‌గా మారింది. అందులోనూ క్రాష్‌ డైట్‌లు, బరువు తగ్గే మందులు జోలి పోకుండా ఆరోగ్యకరంగా తగ్గడం అనేది అందర్నీ ఆకర్షిస్తున్న ఫిట్‌నెస్‌ మంత్రలా మారింది. పైగా అందరు ఆరోగ్య స్పృహతో బరువు తగ్గే ప్రయత్నమే చేస్తుండటం విశేషం. ఈసారి అలానే 40 ఏళ్ల తల్లి చాలా సింపుల్‌ డైట్‌ప్లాన్‌తో కేవలంలో ఏడు రోజుల్లో 5 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారంలోనే ఇంతలా బరువు తగ్గేందుకు సమతుల్య ఆహారంపైనే ఆధారపడ్డానని చెబుతోందామె. మరి ఆమె ఎలాంటి డైట్‌ప్లాన్‌తో తగ్గిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.

40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి కంటెంట్‌ క్రియేటర్‌ రత్న చందు కేవలం ఏడు రోజుల్లోనే ఐదు కిలోలు బరువు తగ్గేందుకు ఆ డైట్‌ ప్లాన్‌ సహాయపడిందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంది. తాను సమతుల్య ఆహారంపైనే ఫోకస్‌ పెట్టి బరువు తగ్గినట్లు వెల్లడించింది.  

మీ ఉదయాన్ని గోరువెచ్చని నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణంతో ప్రారంభించాలని సిఫార్సు చేశారు. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు గింజలతో ఇంట్లో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్‌ను తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల అల్పాహారానికి ముందు జీర్ణక్రియను నెమ్మదిగా యాక్టివ్‌ అయ్యేలా చేస్తుంది. 

ఇక బ్రేక్‌ఫాస్ట్‌గా గిన్నెడు పండ్ల మిశ్రమం, నానబెట్టిన గింజలు, ఒక మిల్లెట్‌ దోస, బుల్లెట్ కాఫీ ఉంటాయి. ఉదయంపూట మిమ్మలని చురుకుగా ఉంచే శక్తివంతమైన ఆహారాల మిశ్రమం ఇది.

ఉదయంపూట శక్తి కోసం..
పాలకూర, దోసకాయ, అల్లంతో చేసిన గ్రీన్ జ్యూస్ తాగమని సూచించారు. కానీ వర్షాకాలంలో కడుపు సమస్యలను నివారించడానికి పచ్చి పదార్థాలను తినవద్దని కూడా ఆ కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నారు.

సమతుల్యమైన మధ్యాహ్న భోజనం ముఖ్యం
మధ్యాహ్న భోజనం చాలా తేలిగ్గా ఉండాలని చెప్పారు. రోటీలు, వండిన కూరగాయలు, పప్పు, పనీర్‌, చోలే, గ్రీక్‌ యోగర్ట్‌, వంటి ప్రోటీన్‌ మూలం తీసుకునేలా చూసుకున్నట్లు తెలిపారామె. ఇందులో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, ప్రోటీన్‌తో కూడిన శక్తిమంతమైన భోజనం.

స్నాక్స్‌..
ప్రాసెస్‌ చేసిన స్నాక్స్‌కు బదులుగా, వేయించిన శనగలు, మఖానా, వేరుశెనగలు, గ్రీన్‌ టీ తినమని తెలిపారు.

తేలికపాటి రాత్రి భోజనం, త్వరగా
రాత్రి భోజనానికి  కూరగాయల సూప్, కిచిడీ, లేదా పనీర్‌తో వేయించిన కూరగాయల వంటి వాటిని ఎంచుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భోజనం తప్పకుండా సాయంత్రం ఏడు గంటలకల్లా తీసుకోవాలని అన్నారు.

నిద్రపోయే ముందు అది తప్పనిసరి..
పంచదార, పాలు కాకుండా ఒక కప్పు మునగ టీతో రోజును ముగించమని చెబుతోంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం, యోగా వంటి వర్కౌట్లు చేయాలని నొక్కి చెప్పింది. కచ్చితంగా జంక్‌ఫుడ్‌కి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండాలని సూచించింది. 

చివరగా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఒక వారంలో 5 కిలోలు తగ్గడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని చెబుతుండటం గమనార్హం. ఈ డైట్‌ప్లాన్‌ని చిన్నగా మొదలుపెడితేనే మొత్తం ఆరోగ్యంపై ప్రభావంతమైన మెరుగుదలను తప్పక చూస్తారని అంటోంది ఇద్దరు పిల్లల తల్లి రత్న చందు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ చిట్కాలను పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. 

(చదవండి: ఇప్పటికీ ఆ దృశ్యం నీలినీడలా వెంటాడుతోంది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ)

 

 

Videos

తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. అల్లాడుతున్న ప్రయాణికులు

ఈ సినిమాలో పెద్ద స్టార్ట్ నటీమణులు ఒకేసారి కనిపించనున్నారు

పెళ్లి అయిన 3 నెలల నుంచే గర్భిణీ అని కూడా చూడలేదు

పవన్ కళ్యాణ్.. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?

భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?

మాజీ సీఎం నాదెండ్ల మృతిపై YS జగన్ సంతాపం

చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

సీఎం రేవంత్ పాటలు పై సింగర్ మధుప్రియ కామెంట్స్

జగనన్న ఇళ్లు కాదు ఊర్లు ఊర్లే సృష్టించాడు, అది వైఎస్ జగన్ అంటే..

సందిట్లో సడేమియా RTC సమ్మెతో.. తెలంగాణలో కర్ణాటక స్పెషల్ బస్సులు

Photos

+5

పులివెందులలో వైఎస్‌ జగన్‌ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)

+5

ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)

+5

తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్‌గా ఉందేంటి! (ఫొటోలు)

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)