Breaking News

శూన్యమే మిగిలింది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ

Published on Tue, 04/21/2026 - 15:50

సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలను పలకరించగా..ఇంకా ఆ దృశ్యం కళ్లముందు మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన మిగిల్చిన కన్నీళ్లని అంతతేలిగ్గా మర్చిపోలేమంటున్నారు భర్తలను పోగోట్టుకున్న మహిళలు. అంతేగాదు తమ కళ్లలోని కన్నీటి చెమ్మ తడి ఆరదు అని గద్గద హృదయంతో చెబుతోంది ఆ పహల్గామ్‌ బాధితుల్లో ఒకరైన డాక్టర్ సుజాత. గుండెల్ని పిండేసే ఆమె మనో వ్యథ వింటే ప్రతి ఒక్కరి మనసు ద్రవించిపోవడమే కాదు ఈ ఉగ్రవాదం సమూలంగా పోయేదెప్పుడూ అన్న ఆక్రోశం కట్టలుతెచ్చుకుంటుంది.

నాటి పహల్గామ్‌ దాడిలో డాక్టర్‌ సుజాత ఎంబీఏ పట్టభద్రుడైన భర్త భరత్‌ భూషణ్‌ని పోగొట్టుకుంది. అతడికి ప్రపంచం గురించి తెలిస్తే..ఆమెకు రోగుల గురించి తెలుసు. అలా ఒకరికొకరం బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉండేవాళ్లం అని భోరున విలపిస్తున్నారు సుజాత. ఆ దాడిని తన నాలుగేళ్ల కుమారుడు ప్రత్యక్ష్యంగా చూశాడంటూ నాటి భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. నాన్నకు దెబ్బ తగిలింది, చాలా రక్త కారింది అన్నమాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. ఆ దాడి నీలి నీడలా వెంటాడుతూనే ఉందంటున్నారామె. 

ఆ బాధను తట్టుకోవడం అంత ఈజీకాదు. ఆ ఘటన తన భావోద్వేగాల నుంచి చిరునవ్వు వరకు అన్నింటి దూరం చేసిందని, కేవలం శూన్యమే మిగిలిందని చాలా నిర్వేదంగా చెప్పుకొచ్చారామె. అంత తేలిగ్గా మర్చిపోలేను ఆ విషాదకరమైన రోజుని, తాను, తన కుమారుడు రక్తంతో తడిచిపోయిన ఆ భయంకపితమైన క్షణాలు బతుకున్నంత వరకు మర్చిపోలేనంటున్నారామె. ఆ కన్నీటి దృశ్యం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉందన్నారామె. అందుకే తాను ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యేలా చూసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారామె. 

కాస్త ఖాళీ దొరికినా..ఆ బాధ వెన్నాడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎంత భయానకమైనవంటే..మనం అనుభవించిన సంతోషకరమైన క్షణాల కంటే ..ఆ బాధే అత్యంత భారంగా అధికంగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నేసి గంటలు ఆస్పత్రిలో పనిచేసినా..ఒక్క ఆదివారం మాత్రం కొడుకు కోసం కేటాయించుకుంటానని చెప్పారు. భతవంతుడి దయవల్ల తన కొడుడు చాలా మంచివాడని అంటున్నారు. 

ఎందుకుంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తండ్రి గురించి అడగలేదు. ప్రశాంతంగా ఉన్నాడని అన్నారు. పైగా తాను లేనప్పుడూ అస్సలు అల్లరి చేయడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాతో అల్లరి చేస్తుంటాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంలో భగవంతుడికి సదా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. అంతేగాదు తన కొడుకుకి తండ్రిన కోల్పోయినట్లు తెలుసు, కానీ ఆ లోటు వాడికి కనపడకుండా అన్నీతానై పెంచుకుంటున్నానని చెప్పారామె. 

నిజానికి ఏప్రిల్‌ నెల ఎప్పుడూ పండుగ మాసం, కానీ అది మాకు సర్వం కోల్పోయేలా చేసిన విషాదకరమైన మాసంగా మిగిలిందన్నారు. "ఈ పహల్గామ్‌ దాడికి కొన్ని రోజుల ముందు తన భర్త పుట్టినరోజు వేడుకులు చేసుకున్నాం  అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 14న విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. నిజానికి తాము ఎప్పుడు గుడికి వెళ్లి..ఆ తర్వాత బయటకు వెళ్లేవాళ్లం. 

ఆరోజు తన తల్లిదండ్రలు కూడా కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పుడూ కూడా అంతగా ఆందోళన చెందలేదు. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే టపాసులు అనుకున్నా..భద్రతా సిబ్బంది అంతా చూసుకుంటారిని అనుకున్నా. కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు, ఒక్క మనిషి గానీ, సాయుధగార్డు గానీ ఉంటే ఆ ఘటనను నివారించి ఉండేవారంటూ". ఆ విపత్కర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. 

బహుశా తీవ్రవాద భావజాలం ఈ దాడులు చేసేవాళ్ల మెదడులను పూర్తిగా బ్రెయిన్‌ వాష్‌ చేశారన్నారు. తాము చేస్తుంది తప్పు కాదు సరైనదే అన్నంత క్రూరంగా మార్చేశారన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టుపెట్టాలో తనకు తెలియదు గానీ..ఇక్కడితో ఈ మారణకాండ ఆగిపోవాలి అని ఉద్విగ్నంగా అన్నారామె. 

ఆ దాడి జరిగిన రోజు తమ పెళ్లిరోజు అని, ఆయనతో తనకు అదే చివరి భయానక జ్ఞాపకమని కన్నీళ్లుపెట్టుకున్నారామె. కాగా, పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఆ దంపతులకు పెళ్లై ఆరేళ్లయింది. ప్రస్తుతం ఆమె తనను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నా..కానీ ఈ నష్టం ఏ స్త్రీకైనా పూడ్చలేనది అని గద్గద స్వరంతో అన్నారు డాక్టర్‌ సుజాత.

 

(చదవండి: ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ)

 

 

Videos

పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం

పసిడి ధరల దూకుడుకు బ్రేక్.. వెండి రూ.5 వేలు ఢమాల్..!

కాపులను నరికేస్తాం! బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)