Breaking News

టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!

Published on Tue, 04/21/2026 - 15:18

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.

ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ పెట్టుబడులు
టెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్‌ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.

తయారీ రంగంలో టెస్లా
టెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం
పీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్‌మెంట్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.

ఆపరేషన్స్, రిటైల్
ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.

ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

#

Tags : 1

Videos

పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం

పసిడి ధరల దూకుడుకు బ్రేక్.. వెండి రూ.5 వేలు ఢమాల్..!

కాపులను నరికేస్తాం! బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)