పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం
Breaking News
ట్రంప్‌కే ఝలక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్.. వీడియో చూశారా?
Published on Tue, 04/21/2026 - 15:04
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌నే రంగంలోకి దించేశాడు తరుణ్ భాస్కర్. ఏఐతో రూపొందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ టీ తాగుతూ ఇండియన్ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసించారు. దీనికి తరుణ్ భాస్కర్.. ఇండియన్ టీ ఎప్పడు బాగుంటుంది.. కానీ మీకిచ్చింది ఇరానీ టీ అంటూ షాకిచ్చారు.
దీనికి డొనాల్డ్ ట్రంప్ షాకయ్యారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ మూవీని ఇరాన్లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్సీస్లో ఎస్వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Dear NRI Simhalu… ❤️🔥#GaayaPaddaSimham Roaring Overseas Release by @SVCRelease @PrathyangiraUS 🦁🔥
TRUMP’ING PREMIERES on APRIL 30 💥#GPS #TharunBhascker @JDmaxmode @fariaabdullah2 @Maanasa_chou @kasyapcineverse @pavansadineni @SAMWoffl @POVStoriesOffl @zeestudiossouth pic.twitter.com/7kqGeFXVl2— Prathyangira Cinemas (@PrathyangiraUS) April 21, 2026
Tags : 1