'సారీ చరణ్.. మగధీర సినిమాలో చేయొద్దని చెప్పా'

Published on Mon, 04/20/2026 - 17:45

డిస్కో శాంతి అప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది. 1965న జన్మించిన డిస్కో శాంతి దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు.

టాలీవుడ్ హీరో శ్రీ హరితో పెళ్లి..

ఐటమ్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన డిస్కో శాంతి.. టాలీవుడ్ హీరో  శ్రీహరిని 1996లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికే పరిమితమైంది. కానీ ఊహించని విధంగా శ్రీహరి అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మగధీరలో వద్దని బావకు చెప్పా..

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డిస్కో శాంతి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మగధీర చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్‌ చేయొద్దని బావ శ్రీహరికి చెప్పానని తెలిపింది. ఒక హీరో భార్యగా.. హీరో వేరు.. సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు కదా అనే ఆలోచన నాలో ఉండేదని పేర్కొంది. రాజమౌళి సినిమాలో హీరోగా అయితే చేయమని చెప్పేదాన్ని.. కానీ సపోర్టింగ్‌ రోల్‌ అనే సరికి వద్దని చెప్పానని డిస్కో శాంతి వెల్లడించింది. మొదట బావ నాకు మగధీర కథ చెప్పలేదని తెలిపింది. కానీ మగధీర సినిమాలో ఈ క్యారెక్టర్‌ లేకపోతే సినిమానే లేదనే విషయం నాకు తర్వాత అర్థమైందని శాంతి చెప్పుకొచ్చింది. రాజమౌళి గారు ఈ క్యారెక్టర్‌ను ఎంత మనసు పెట్టి చేయించారోనని పంచుకుంది. 

కాగా.. డిస్కో శాంతి 1986లో తొలిసారి ఉదయగీతం చిత్రంలో నటించారు. మొదట కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం వచ్చింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నారు. అతని తండ్రి సీఎల్ ఆనందన్ సినిమాల్లో కూడా నటించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు.

Videos

లోకేష్ నిద్రపోడు, నీ మేనత్తలు ఎక్కడున్నారో తెలుసా!

టీ తాగితే క్యాన్సర్ కు చెక్! కానీ ఇలా తాగండి..

హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విజయ్ భారీ సినిమా

భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...

Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!

మీ మేనత్తలు అంటే మీ అమ్మకు రోత. లోకేష్ కు ఇచ్చిపడేసిన లక్ష్మీపార్వతి

అమెరికా యూనివర్సిటీలో బంగారు ఫలకంపై రోజా కూతురి పేరు

సొంత కార్యకర్తకే కడుపు మండి రోడ్డుపై మంచం వేసుకుని నిరసన

గుంటూరు జిల్లాలో దారుణం మైనర్‌పై అత్యాచారం

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

Photos

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)

+5

కుందనపు బొమ్మలా దీప్షిక చంద్రన్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో డస్కీ బ్యూటీ డింపుల్ (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)

+5

సింహాచలం అప్పన్న చందనోత్సవం..భారీగా భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ‘కళా సెంటినియల్‌ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)