'పెద్ది' కష్టం.. 5 నిమిషాల సీన్‌కు 3నెలల సమయం

Published on Mon, 04/20/2026 - 16:23

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పెద్ది’.. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కోసం పనిచేసిన ఫ్రేమ్ ఎక్స్ వీఎఫ్ఎక్స్ సంస్థ అధినేత నిలేష్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంగ్లీష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మూవీ వీఎఫ్‌ఎక్స్‌ పనిగురించి మాట్లాడారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్త.

పెద్ది సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించి ఫ్రేమ్‌ ఎక్స్‌ అనే సంస్ధ పనిచేస్తుంది. మూవీలోని కొన్ని సీన్స్‌ గురించి ఆ సంస్థ అధినేత నిలేష్‌ పలు వ్యాఖ్యలు చేశారు.పెద్ది సినిమాలోని 5 నిమిషాల రెజ్లింగ్‌ సీన్‌ వీఎఫ్‌ఎక్స్‌ కోసం చాలా ఎక్కువ సమయం పడిందని ఆయన అన్నారు. ఈ సీన్‌ పూర్తి చేసేందుకు సుమారు 3నెలల సమయం పడినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. వీఎఫ్ఎక్స్ పని ఫ్రేమ్ వారీగా ఉంటుందని, ఒక నిమిషానికి 1440 ఫ్రేమ్‌లు ఉంటాయని  ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ప్రతి ఫ్రేమ్‌లో చేసిన మెరుగుదల పరిధిని బట్టి పని ఖర్చు మారుతుంది" అని ఆయన చెప్పారు.

పెద్ది గురించి నిలేష్‌ ఇచ్చిన అప్‌డేట్ అభిమానులను ఖచ్చితంగా సంతోషపరుస్తుంది. ఎందుకంటే ఎలాంటి రాజీ లేకుండా ప్రేక్షకులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం విఎఫ్ఎక్స్ (VFX) కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. పెద్ది మూవీలో  రామ్‌చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శివరాజ్‌ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.
 

Videos

లోకేష్ నిద్రపోడు, నీ మేనత్తలు ఎక్కడున్నారో తెలుసా!

టీ తాగితే క్యాన్సర్ కు చెక్! కానీ ఇలా తాగండి..

హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విజయ్ భారీ సినిమా

భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...

Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!

మీ మేనత్తలు అంటే మీ అమ్మకు రోత. లోకేష్ కు ఇచ్చిపడేసిన లక్ష్మీపార్వతి

అమెరికా యూనివర్సిటీలో బంగారు ఫలకంపై రోజా కూతురి పేరు

సొంత కార్యకర్తకే కడుపు మండి రోడ్డుపై మంచం వేసుకుని నిరసన

గుంటూరు జిల్లాలో దారుణం మైనర్‌పై అత్యాచారం

చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం

Photos

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)

+5

కుందనపు బొమ్మలా దీప్షిక చంద్రన్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో డస్కీ బ్యూటీ డింపుల్ (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర శబరిమల (అయ్యప్ప స్వామి దేవాలయం) ఎక్కడ ఉందో తెలుసా (ఫొటోలు)

+5

సింహాచలం అప్పన్న చందనోత్సవం..భారీగా భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ‘కళా సెంటినియల్‌ సాగా’ చిత్రకళా ప్రదర్శన (ఫొటోలు)