షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..
Breaking News
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్
Published on Sun, 04/12/2026 - 13:43
ఓటీటీల్లో సినిమాలతో పాటు డిఫరెంట్ స్టోరీలతో తీసిన బోలెడన్ని వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లలో అలా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న వాటిలో 'ఫ్రమ్' సిరీస్ ఒకటి. హీరో విశ్వక్ సేన్ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరికొందరికి తెలిసింది. ఇప్పుడీ సిరీస్ నుంచి నాలుగో సీజన్ వచ్చేస్తోంది. రీసెంట్గా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా ఇప్పుడు అధికారిక ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)
'ఫ్రమ్' సిరీస్ విషయానికొస్తే.. అమెరికాలోని ఓ రహస్య గ్రామం. ఇక్కడికి ఒకసారి వచ్చినవాళ్లు తిరిగి బయటపడలేరు. పొద్దున్న అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రయితే ఈ ఊరిలో నరరూప రాక్షసుల్లాంటి మనుషులు తిరుగుతారు. వాళ్ల నుంచి ఇక్కడ ఉండే కొందరు ఎలా తమని తాము రక్షించుకున్నారు? ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అక్కడి నుంచి బయటపడ్డారా అనేదే కాన్సెప్ట్. ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 4వ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)
Tags : 1