Breaking News

నీ పెళ్లాన్ని సన్నగా చేయ్‌ అని ట్రోలింగ్‌.. ఆ వ్యాధి వల్లే..: విశ్వ

Published on Fri, 04/10/2026 - 11:51

నటుడు విశ్వ సీరియల్స్‌లో, సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితమే విశ్వ ఫిట్‌నెస్‌ క్లబ్‌ ఓపెన్‌ చేసి జిమ్‌ ట్రైనర్‌గానూ మారాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. విశ్వ మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లవుతోంది. 10వ తరగతి అయిపోగానే పరిశ్రమలో అడుగుపెట్టాను. పెళ్లికోసం, విద్యార్థి వంటి పలు చిత్రాల్లో నటించాను. తర్వాత సీరియల్స్‌ చేశాను. 

తొక్కేశారు
కొంతకాలంగా సీరియల్స్‌కు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాను. అయితే ఒకానొక సమయంలో నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు. అప్పుడు నా తమ్ముడి సంపాదనపైనే బతికాను. ఆరునెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పనివాళ్లు రాకపోతే నేను గిన్నెలు కడిగేవాడిని. రేషన్‌ బియ్యం తిన్న రోజులున్నాయి అన్నాడు.

నా అభిమాని
శ్రద్ధతో తన లవ్‌స్టోరీ గురించి చెప్తూ.. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్‌ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధపడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో శ్రద్ధ మెసేజ్‌ చేయడంతో టైంపాస్‌ చేద్దామని నా నెంబర్‌ ఇచ్చాను. తనకు చాలా కనెక్ట్‌ అయిపోయాను. వారం రోజులకే తను ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. నా గురించి పూర్తిగా ఆరా తీశాకే పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ట్రోల్స్‌
ఆమెను దేవుడు నాకోసం పంపిన ఏంజెల్‌ అని భావిస్తాను. విశ్వ ఫిట్‌నెస్‌ క్లబ్‌లో శ్రద్ధ డైట్‌ ప్లాన్‌, ఫుడ్‌ ప్రిపేర్‌ చేస్తుంటుంది. నేనేమో ఎక్సర్‌సైజ్‌ చేయిస్తాను. అయితే మేమిద్దరం కలిసి సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో పెడితే చాలు.. ముందు నీ పెళ్లాన్ని సన్నగా చేయు, వేరేవాళ్లకు నీతులు చెప్పడం కాదు, ఇంట్లో సక్కగ చూసుకో అని ట్రోల్స్‌ చేస్తున్నారు. వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదనుకోండి.

ఆ వ్యాధి వల్లే..
అయితే రెండోసారి కొడుకు పుట్టిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టాం. కానీ తనకు కార్పెల్‌ టన్నెల్‌ అనే అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల చేతులు బలహీనంగా మారిపోయాయి. పిల్లాడికి షర్ట్‌ బటన్‌ కూడా పెట్టేంత శక్తి లేకపోయింది. అంటే.. తన పనులు తను చేసుకోలేదు. ఆ వ్యాధి వల్ల ఎక్సర్‌సైజ్‌ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టింది' అని విశ్వ చెప్పుకొచ్చాడు.

చదవండి: లోక సినిమా.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి

Videos

వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు

నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది

మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు

మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్

వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

చిరు ఆగ్రహం

హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్

MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్

ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)