Breaking News

అవన్నీ పీరియడ్స్‌లో ఉండగానే చేశా: శ్రీలీల

Published on Thu, 04/09/2026 - 15:35

శ్రీలీల.. తక్కువకాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌ హీరోల సరసన సినిమాలు చేసింది. సన్నజాజి తీగలా ఉండే ఈ బ్యూటీ తన డ్యాన్స్‌ స్టెప్పులతో మరింత ట్రెండ్‌ అయింది. అయితే తాను నటించిన చాలా పాటలు పీరియడ్స్‌లో ఉండగానే చిత్రీకరణ జరిగాయంటోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో శ్రీలీల మాట్లాడుతూ.. 'నేను చాలా పాటలకు డ్యాన్స్‌ చేశాను. అందులో హిట్‌ సాంగ్స్‌ అన్నీ దాదాపు నెలసరి సమయంలో చేసినవే! సమానత్వం కోరుకున్నప్పుడు మనం పీరియడ్స్‌ను సాకుగా చూపించకూడదని నా అభిప్రాయం. 

సాకుగా చూపించొద్దు
మనం శారీరకంగా, మానసికంగా అన్నింటిని అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా అవకాశాలు, అధికారం, హక్కులు కోరుతున్నప్పుడు నెలసరి వంటి సమస్యలను సాకుగా చూపించి వెనక్కు తగ్గడం కరెక్ట్‌ కాదు. మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి' అని పేర్కొంది. అయితే ఆమె కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలసరిలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదని, దాన్ని ఎవరూ కావాలని సాకుగా చూపించరని కామెంట్లు చేస్తున్నారు.

తప్పేముంది?
డాక్టర్‌ చదివిన శ్రీలీలకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేసేవారు ఎంతమంది లేరు, ఆ ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వెళ్లాలని చెప్పిందే తప్ప.. తప్పుగా ఏం మాట్లాడిందని మరికొందరు శ్రీలీలను సమర్థిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల చివరగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో నటించింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

చదవండి: నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు: నటుడు

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)