Breaking News

ఓటీటీలో 'ధురంధర్‌-2' ట్విస్ట్‌.. మరింత ఆలస్యం

Published on Thu, 04/09/2026 - 15:23

రణవీర్‌ సింగ్‌- ఆదిత్య ధర్‌ కాంబినేషన్‌ మూవీ 'ధురంధర్‌-2'.. ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. అనుకున్న తేదీకంటే మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు రావచ్చని సమాచారం. హౌస్‌ఫుల్‌ థియేటర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 1700 కోట్లకుపైగానే కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం  స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది. ఈ చిత్రం హక్కులు జియోహాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు టాక్‌ ఉంది.

సాధారణంగా బాలీవుడ్‌ చిత్రాలు 8వారాల థియేటర్‌ రన్‌ తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తారు. ఈ క్రమంలో ధురంధర్‌-2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లెక్కన మే 20లోపు ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈసారి లెక్కలు మారిపోయాయని టాక్‌. ప్రస్తుతం కొనసాగుతున్న ఊహాగానాల ప్రకారం, ఈ చిత్రం  ఓటీటీ విడుదల తేదీని  జూన్ మొదటి వారానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుపుతున్నారు. 

మే నెల మధ్యలో టోర్నమెంట్ ఉత్కంఠభరితమైన తుది దశకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో  క్రికెట్ సందడి పతాక స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్‌ ధురంధర్‌-2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే వీక్షకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఐపీఎల్ ముగియగానే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని  జియోహాట్‌స్టార్ వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తోంది.  త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు.

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)