బాబుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
ఆ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా.. నా సక్సెస్‌కు అతడే కారణం: మృణాల్
Published on Wed, 04/08/2026 - 13:34
తెరపై అవకాశాలు సంపాదించడం అంత ఈజీ కాదు. ఒక్క ఛాన్స్ రావడానికి కొందరికి ఏళ్లకు యేళ్లు పడుతుంది. మరికొందరికి వెంటనే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అందులోనూ బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్‌ను దాటుకుని బుల్లితెర నటి అన్న ట్యాగ్ నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది మృణాల్ ఠాకూర్.

సీరియల్ నుంచి సినిమాల్లోకి..
2012లో ముజ్‌సే కుచ్ కేటి.. యే ఖామోషియాన్ సీరియల్‌లో నటించింది. తర్వాత అర్జున్, కుంకుమ భాగ్య సీరియల్‌లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మరాఠిలో ఒకే ఏడాది (2014) మూడు సినిమాలు చేసింది. అయినా మృణాల్ ఠాకూర్‌కు బ్రేక్ రాలేదు. మళ్లీ సినిమా చేయడానికి నాలుగేళ్లు పట్టింది. అయితే ఓ హీరోతో చేసిన యాడ్ వల్ల తన కెరీర్ మలుపు తిరిగిందంటోంది మరాఠి బ్యూటీ.
ఆ హీరో వల్లే..
మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెకాయిట్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. హీరో రణ్‌వీర్ సింగ్ నా లక్కీ చార్మ్. నేను చిత్రపరిశ్రమలో ఉండటానికి ఆయనే కారణం. కెరీర్ తొలినాళ్లలో మోడల్‌గా ఆయనతో కలిసి ఓ హెయిర్‌బ్రాండ్ యాడ్‌లో నటించాను. ఆ వాణిజ్య ప్రకటన రిలీజైన తర్వాతే చాలామంది దర్శకనిర్మాతలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనే ఇస్తాను. ఆయన నాకెంతో సాయం చేశారు. తనెప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటాడు.

సినిమా
ధురంధర్ మూవీలో అయితే నాకు రణ్‌వీర్ కనిపించలేదు, హంజా మాత్రమే కనిపించాడు. అంత అద్భుతంగా నటించాడు. ఆయన ఇలాంటి బ్లాక్‌బస్టర్స్ మరెన్నో అందుకోవాలి అని చెప్పుకొచ్చింది. కాగా రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవగా.. ఈ ఏడాది మార్చి 19న దానికి సీక్వెల్ వచ్చింది. అదే ధురంధర్: ద రివేంజ్. రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
చదవండి: అల్లు అర్జున్- అట్లీ సినిమా టైటిల్ ఇదే.. గుండుతో కనిపించిన బన్నీ
Tags : 1