Breaking News

దురంధర్‌ కలెక్షన్స్‌.. బాహుబలి-2 రికార్డ్‌పై గురి..!

Published on Tue, 04/07/2026 - 18:15

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్‌ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622.72 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డ్‌పై కన్నేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి-2 వసూళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

దురంధర్‌-2 రిలీజైన 18 రోజుల్లోనే కన్నడలో రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ బాహుబలి-2 కన్నడలో రూ. 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్‌-2 ఈ రికార్డ్‌కు కేవలం రూ.9 కోట్ల దూరంలోనే నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2ను దాటేయనుంది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్‌-2 నిలవనుంది.

ఇక కర్ణాటక బాక్సాఫీస్‌ను పరిశీలిస్తే కన్నడ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినప్పటికీ తెలుగు చిత్రాలు కూడా కన్నడలో సత్తా చాటుతున్నాయి. శాండల్‌వుడ్ హీరో రిషబ్ శెట్టి మూవీ 'కాంతార చాప్టర్ 1' రూ. 247.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యశ్‌ నటించిన 'కేజీఎఫ్ 2' కొనసాగుతోంది. కన్నడలో టాప్-5 చిత్రాలలో 'బాహుబలి 2' మాత్రమే కన్నడేతర చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ రికార్డ్‌ను దురంధర్-2 అధిగమించే ఛాన్స్ ఉంది. కాగా.. 'ధురందర్ 2' ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. కర్ణాటకలో 'బాహుబలి 2'  తర్వాత రూ. 100 కోట్ల మార్కును దాటిన రెండో కన్నడేతర చిత్రంగా 'ధురందర్ 2' నిలిచింది.

కాగా.. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు.

 

 

 

 

 

 

 

 

Videos

రావాలి మావిగన్.. కావాలి ఏపీ విన్

బూతు కిట్టు.. బ్రోకర్ కృష్ణ.. నీ తోలు వలిచి చెప్పులు కుట్టించకపోతే..

ABN రాధాకృష్ణ రాతలపై YS జగన్ ఆగ్రహం

డ్రంక్ అండ్ డ్రైవ్ బీభత్సం.. ఇద్దరు యువకులు మృతి

కాల్పుల విరమణ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

నీతిలేని కుక్క.. ఇంకోసారి అలాంటి రాతలు రాస్తే చెప్పుతో కొడతాం..

బూతు కిట్టూ నీతిలేని రాతలు.. చంద్రబాబు చెబితే దేనికైనా

అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?

బ్రోకర్ రాధాకృష్ణ నీకు కూతుర్లు లేరా.. RK రోజా వార్నింగ్

CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...

Photos

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)