ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
దేవరకొండతో పెళ్లి తర్వాత తొలి బర్త్ డే.. సెలబ్రేషన్స్ చూశారా?
Published on Mon, 04/06/2026 - 16:42
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును మరింత స్పెషల్‌గా జరుపుకుంది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో తన బర్త్ డే రోజు మరింత ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాల మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్‌తో పెళ్లి తర్వాత జరిగిన పుట్టినరోజు కావడంతో మరింత ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రాయలసీమలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. జయమ్మ పాత్రలో రష్మిక వీడియోలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక బర్త్ డే రోజు మైసా టీమ్ సైతం ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది.
Surrounded by love & powered by happiness!🫶#RashmikaMandanna celebrates her birthday the sweetest way!❤️#VijayDeverakonda #VIROSH #TeluguFilmNagar pic.twitter.com/MA5BseCsce
— Telugu FilmNagar (@telugufilmnagar) April 6, 2026
Tags : 1