ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు
Breaking News
పెద్దిలో ఐటం సాంగ్? భలే తప్పించుకుందే!
Published on Mon, 04/06/2026 - 13:08
సీతారామం చిత్రంతో సెన్సేషన్ అయింది మృణాల్ ఠాకూర్. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా తను ప్రధాన పాత్రలో నటించిన మూవీ డెకాయిట్. ఇందులో సరస్వతిగా యాక్ట్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పెద్దిలోనూ ఐటం సాంగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
పెద్దిలో ఐటం సాంగ్?
తాజాగా డెకాయిట్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మృణాల్‌కు పెద్దిలో ఐటం సాంగ్ గురించి ప్రశ్న ఎదురైంది. కానీ మృణాల్ సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా తప్పించుకుంది. ఆమె మాట్లాడుతూ.. డెకాయిట్ కోసం ఏమైనా అడుగుతారని చూస్తున్నాను. సరే కానీ మీకో ఆసక్తికర విషయం చెప్పాలి. నా మాతృభాష మరాఠి. మరాఠి సినిమా కోసం పుణెలో షూటింగ్ చేస్తున్నాను.
అదే సంతోషం
అక్కడున్న జనం మరాఠి చాలా చక్కగా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోయారు. నేను మరాఠీ అమ్మాయినే అని చెప్పినా సరే, కాదు.. తెలుగమ్మాయినే అనుకుంటున్నారు. ఒకరకంగా అది నాకు సంతోషంగానే ఉంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చాలామంది హిందీ ప్రేక్షకులు ఎటువంటి సబ్‌టైటిల్స్ లేకుండా తెలుగులోనే చూశారు. ఒక మహిళ అయితే ఎయిర్‌పోర్టులో నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది.
అదే నాకు దక్కిన గౌరవం
తెలుగు సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసినందుకు థాంక్యూ అని తెగ సంతోషపడిపోయింది. ఆమె ఆనందం చూస్తుంటే ముచ్చటేసింది. అదే నాకు దక్కిన గౌరవంగా భావించాను అంటూ అసలు సమాధానానికి బదులుగా ఏదేదో చెప్పింది. కానీ పెద్ది గురించి మాత్రం పెదవి విప్పలేదు. ఇకపోతే సీతారామం, హాయ్ నాన్నలు తనకు ఒక బెంచ్‌మార్క్ సెట్ చేశాయని, దానివల్ల పలు భారీ బడ్జెట్ సినిమాలను తిరస్కరించక తప్పలేదని మృణాల్ తెలిపింది.
చదవండి: ఐదేళ్లుగా పాటలకు దూరం.. ఆ కారణం వల్లే: సింగర్
Tags : 1