నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..!

Published on Sun, 04/05/2026 - 16:42

అత్యంత అరుదైన వింత కేసు. నొప్పులు పడుతున్న టైంలో ఎవ్వరైన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. కానీ ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భావోద్వేగభరితమైన ఆ సమయంలో విచారణకు హాజరుకావడం విచిత్రం అనుకుంటే..అక్కడ ఆమె వాదన న్యాయమూర్తిని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎవ్వరిని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండ కట్టుదిట్టం చేసి అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. చివరికి ఆ మహిళ..ఇప్పటికీ కోర్టుని, వైద్యులపై ఆరోపణలు చేస్తూ తిట్టిపోస్తూనే ఉంది. 

అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన చెరీస్‌ డోయ్లిఆస్ప్రతి బెడ​్‌పై నొప్పులు పడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో డెలివరీ అనగా..బలవంతంగా కోర్టు ముందుకు హాజరుపరిచారు వైద్యులు. అంతేగాదు ఆమె అనుమతి లేకుండానే ఇదంతా జరగడం విశేషం. వర్చువల్‌ కోర్టు విచారణకు ప్రసవ వేదనతో ఉన్న గర్భణీని బలవంతంగా ప్రవేశపెట్టారు. ఈ దురదృష్టకర ఘటన 2024లో చోటుచేసుకుంది. ప్రసవ వేదన మొదలైన వెంటనే రాత్రికి రాత్రే ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ హాస్పిటల్‌కు చేరుకుంది.

అయితే ఆమె 12 గంటల పాటు ప్రసవ నొప్పులు అనుభవిస్తోంది. ఆ సమయంలోనే ఆమెను వర్చువల్‌ కోర్టు ముందు హాజరుపరిచారు వైద్యులు. తను వర్చువల్‌ కోర్టు ముందున్న విషయం తెలుసుకుని ఆ నిండు గర్భిణీ కంగుతింది. డోయ్యి వృత్తిపరంగా ప్రసవ సహాయకురాలైన నర్సు. అయితే ఆమె నార్మల్‌ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు కచ్చితంగా సీసెక్షన్‌ చేయాల్సిన ఎమర్జెన్సీ. కానీ అందుకు ససేమిరా అంటోంది డోయ్లి. ఎందుకంటే ముగ్గురు పిల్లల తల్లిగా గతంలో జరిగిన సీ సెక్షన్ల నుంచి కోలుకోవడం కష్టంగా ఉందని, దానివల్ల రక్తస్రావంతో అనేక సమస్యలు వస్తున్నాయని వాదిస్తోంది. 

ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నా..మొండిగా ప్రవర్తించడంతో అక్కడి ప్రభుత్వ అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసి కోర్టు ముందు హాజరపర్చింది. ఆ విషయాన్నే పేషెంట్‌ డోయ్లికి వివరించారు కూడా. అందువల్లే డోయ్లి నొప్పులు పడుతూనే కోర్టులో విచారణకు హాజరైంది. అయితే వైద్యులు ఆమె గనుక నార్మల్‌ డెలివరీకి ట్రై చేస్తే..గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీ సెక్షన్‌ చేయక తప్పదని వాదిస్తుండటం గమనార్హం. అంతేగాదు డోయ్లి వైద్యులు గనుక సాధారణ ప్రసవం చేయలేకపోతే గనుక మరొక ఆస్పత్రికి తరలించమని కూడా అభ్యర్థించింది. 

అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి..ఆమెకు తక్షణమే ఆపరేషన్‌ చేయమని ఆదేశించలేదు గానీ, విపత్కర పరిస్థితి ఎదురైతే ఆమె సమ్మతితో పనిలేకుండానే ఆస్పత్రి శస్త్ర చికిత్స చేయవచ్చని సూచించింది. అయితే రాత్రికి ఆమె బిడ్డ పల్స్‌ రేట్‌ పడిపోవడంతో హుటాహుటినా..డోయ్లికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయక తప్పలేదు వైద్యులకు.

ఆ తర్వాత ఆమెను మళ్లా కోర్టు ముందు హాజరుపర్చారు. అప్పుడు కూడా, వైద్యులపై మండిపడుతూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటికీ దాన్ని ఆమె అవమానంగా భావిస్తూ..కోర్టుని, సదరు ఆస్పత్రి వైద్యులను తిట్టిపోస్తుండటం గమనార్హం. 

 

(చదవండి: రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..)
 

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)