Breaking News

కాలితో తన్నా.. నావల్ల అనుష్క నొప్పితో బాధపడింది!

Published on Sat, 04/04/2026 - 11:35

ఏదో హడావుడిగా కాకుండా తాపీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అడివి శేష్‌. ఈయన కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం హిట్‌:ద సెకండ్‌ కేస్‌. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్‌ తర్వాత అతడు డెకాయిట్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించిన ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

బాహుబలి జ్ఞాపకాలు
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' సినిమాలో అనుష్కను హీనంగా చూసే ఓ సీన్‌ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అడివి శేష్‌ మాట్లాడుతూ.. అనుష్క చాలా మంచి వ్యక్తి. స్వీటీ.. ఆ పేరులోనే తెలిసిపోతోంది. ఖైదీగా పడి ఉన్న అనుష్కను కట్టెతో తడుతూ నిద్రలేపాలి. ఆ సన్నివేశం చిత్రీకరణ అయిపోగానే నీకు ఏం తగల్లేదు కదా? అని అడిగాను.

బలంగా తన్నడంతో..
ఎందుకంటే అప్పటికే నావల్ల ఒకసారి తనకు దెబ్బ తగిలింది. నేను కాలితో తన్నడం వల్ల ఆమె మెడ నొప్పితో బాధపడింది. నిజానికి ముందు నేను సున్నితంగానే తన్నాను. కానీ రాజమౌళి సర్‌ అది సరిపోదన్నాడు. దాంతో నేను బలంగా తన్నాల్సి వచ్చింది. దానివల్ల ఆమెకు దెబ్బ తగిలింది. అప్పుడే తొలిసారి తనతో మాట్లాడాను అని అడివి శేష్‌ తెలిపాడు. కాగా బాహుబలి మొదటి భాగంలో భళ్లాల దేవ (రానా దగ్గుబాటి) కొడుకు భద్రుడిగా శేష్‌ నటించాడు.

చదవండి: ధురంధర్‌లో విలన్‌ రోల్‌.. ముగ్గురు రిజెక్ట్‌ చేశారు: కాస్టింగ్‌ డైరెక్టర్‌

Videos

గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి

ప్రజల కోసం అసెంబ్లీ నక్సలైట్ అవుతా

నాగేంద్రను స్టేషన్ కు పిలిచి విచారించాలి

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నేలమట్టం! ఇరాన్ షాకింగ్ ప్రకటన

SHOCKING CCTV FOOTAGE: వామో ఏంటి ఇది కొట్టులో విక్స్ కొనడానికి వచ్చి...

వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ

రోడ్లు ఖాళీ ఎండ దెబ్బకు.. లాక్ డౌన్ పరిస్థితి

ఇంకెప్పుడు రాజీనామా! BR నాయుడుపై కట్టలు తెగిన ఆగ్రహం

ఇరాన్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు ఇక చుక్కలే..

BR నాయుడు అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు

Photos

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)

+5

‘బైకర్‌’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)