థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
Published on Fri, 04/03/2026 - 10:56
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై చిన్ని బాబు అంటూ తనయుడిపై తన ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అల్లు అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మలయాళ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్షన్‌లో పని చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.
Many happy returns of the day to the love of my life. Happy Birthday, my chinni babu. #HBDAlluAyaan #AyaanisaVibe pic.twitter.com/czUM77roIv
— Allu Arjun (@alluarjun) April 3, 2026
Tags : 1