పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
దేవుడిని నమ్మనంటూ చర్చిలో ప్రకాశ్‌రాజ్.. విమర్శలపై కౌంటర్!
Published on Thu, 04/02/2026 - 15:31
తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కారణం.. ఆయన తల్లి సువర్ణలత అంత్యక్రియలను క్రైస్తవ ఆచారం ప్రకారం నిర్వహించడమే! దేవుడినే నమ్మనని చెప్పే ఆయన తల్లి భౌతికకాయాన్ని చర్చిలో పెట్టి ప్రార్థనలు, కీర్తనలు ఎందుకు చేయించాడని పలువురూ విమర్శలు గుప్పించారు.
నేను నమ్మను
ఈ ట్రోలింగ్‌పై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించాడు. అవును, నేను దేవుడిని నమ్మను, కానీ మా అమ్మ నమ్మేది. తన విశ్వాసాల ప్రకారం అంతిమసంస్కారాలు పొందే హక్కును కాదనడానికి నేనెవర్ని? ఇది తనకు నేనిచ్చే కనీస గౌరవం. ఒంటినిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఇదేం అర్థమవుతుంది? అని ట్వీట్ చేశాడు.
నాస్తికుడిగా ప్రయాణం
ఇది చూసిన కొందరు తల్లి నమ్మకాల్ని గౌరవించి, ఆమెకు నచ్చినట్లుగానే అంతిమయాత్ర చేసిన ప్రకాశ్‌రాజ్‌ను సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మీ తల్లి నమ్మకాన్ని గౌరవిస్తున్నావు, బాగానే ఉంది.. మరి మా నమ్మకాల్ని ఎందుకు హేళన చేస్తావు? ఎందుకు ద్వేషిస్తావు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత క్రైస్తవురాలు కాగా తండ్రి మంజునాథ్ రాయ్ హిందువు. భిన్నమైన మతాల నేపథ్యంలో పెరిగినప్పటికీన ఆయన ఏ మతంవైపూ అడుగు వేయలేదు. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు.
Yes. I don’t believe in god .. but my mother believed in her god . Who am i to deny her .. the right to be buried according to her belief. This is the basic respect we give one another. Will you Hate mongering monsters understand this #justasking https://t.co/vD1GhySf3M
— Prakash Raj (@prakashraaj) April 2, 2026
చదవండి: అచ్చం ఓయ్ హీరోయిన్‌లా ఉందే.. ఎవరీ మానస శర్మ?
Tags : 1