పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్ ఏమవుతుందో?
Published on Thu, 04/02/2026 - 07:04
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ అద్భుతమైన హిట్స్ అందుకుంది. చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ తదితరులు తమ సినిమాలతో హిట్స్ అందుకుని మంచి ఆరంభం ఇచ్చారు. కానీ దీన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో టాలీవుడ్ కొనసాగించలేకపోయింది. కానీ ఏప్రిల్ మాత్రం సక్సెస్ అవుతుందనే ఆశలు రేపుతోంది. ఇంతకీ ఈ నెలలో తెలుగులో రాబోతున్న చిత్రాలేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?
(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్)
ఈనెల తొలివారంలో శర్వానంద్ 'బైకర్' మూవీతో రాబోతున్నాడు. ట్రైలర్ బాగుండేసరికి దీనిపై కాస్త బజ్ ఏర్పడింది. సంక్రాంతికి సక్సెస్ అందుకున్న శర్వా.. దీనితోనూ హిట్ కొట్టేలానే ఉన్నాడు. దీనితోపాటు 'రాకాస' అనే హారర్ కామెడీ చిత్రం రాబోతుంది. ట్రైలర్, పాటల్లాంటివి ఓకే ఓకే అనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో? వీటితోపాటు సముద్రఖని 'కార్మేని సెల్వం', శరవణనన్ 'లీడర్' లాంటి మూవీస్ కూడా జాబితాలో ఉన్నాయి కానీ వీటిపై ఎలాంటి బజ్ లేదు.
రెండో వారంలో ప్రస్తుతానికైతే నాలుగు సినిమాలున్నాయి. నిఖిల్ 'స్వయంభు' ఇదే తేదీన రావాల్సి ఉంది కానీ ప్రమోషన్స్ ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. దీంతో వాయిదా పడుతుందా అనే అనుమానం కలుగుతోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అడివి శేష్ నుంచి 'డకాయిట్' అనే చిత్రం వస్తోంది. ఈ రెండు కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నప్పటికీ హైప్ ఓ మాదిరిగానే ఉంది. వీటితో పాటు పల్లి చట్టంబి అనే మలయాళ డబ్బింగ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లైనులో ఉన్నాయి. ఇవి సక్సెస్ అయితే ఆశ్చర్యమే.
మూడోవారంలో మూడు తెలుగు సినిమాలొస్తున్నప్పటికీ అవన్నీ చిన్నవే. మూడేళ్ల తర్వాత నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తిక్'గా వస్తున్నాడు. తిరువీర్ 'పాపం ప్రతాప్', హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. వీటిపై ప్రస్తుతానికి ఎలాంటి బజ్ లేదు. హిట్ అయితే అదృష్టమే అనే చెప్పొచ్చు.
చివరివారంలో రామ్ చరణ్ 'పెద్ది' ఉన్న నేపథ్యంలో అంతకుముందు తెలుగు చిత్రాలు రిలీజ్ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. లెజెండరీ మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్'.. 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇక చరణ్ 'పెద్ది' మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీనికి పోటీగా ధనుష్ 'కర' మూవీ ఉంది. దీని ప్రమోషన్స్ కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. చూడాలి మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?
ఏప్రిల్‌లో రిలీజయ్యే వాటిలో 'పెద్ది' మాత్రమే పెద్ద సినిమా. అందుకు తగ్గట్లే హైప్ ఉంది. మిగతా మూవీస్ పర్లేదనిపించే హైప్ ఉన్నప్పటికీ ఏవి హిట్ అవుతాయనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్)
Tags : 1