భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
'డోర్ తీసి చీర మార్చుకో'.. ఆ స్టార్ నిర్మాతను కాలితో తన్నా: నటి
Published on Sun, 03/29/2026 - 13:47
భయం తన బ్లడ్డులోనే లేదంటోంది నటి రాధా ప్రశాంతి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమెను టైగర్, ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 125 సినిమాలు చేసిన ఆమె చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను ఏకరువు పెట్టింది.
అర్ధరాత్రి రాద్ధాంతం
రాధా ప్రశాంతి మాట్లాడుతూ.. 'నేనుంటున్న ఫ్లాట్ 2005లో బిల్డర్ దగ్గర కొనుక్కున్నాను. మొదట్లో దాన్ని అద్దెకిచ్చాము. అక్కడేం జరుగుతుందో నాకు తెలిసేది కాదు. 2012లో మేము ఆ ఫ్లాట్‌కు షిఫ్ట్ అయ్యాం. ఆ అపార్ట్‌మెంట్‌లో అక్రమ కార్యకలాపాల ఆఫీసులు నడిపిస్తున్నారని తెలిసింది. వాళ్లు తాగి వచ్చి అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టేవారు. ముఖ్యంగా వాచ్‌మెన్ కుటుంబంతోనే నాకు ప్రాణభయం ఉంది.
నా ఇంటిని తగలపెట్టారు
నా ఇంటి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతోంది. 2014లో పోలీసులు రైడ్ చేసి ఆ బిల్డింగ్‌ను సీజ్ చేశారు. కొంతకాలానికి మళ్లీ ఆ దందా మొదలుపెట్టారు. వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. వాళ్ల దందాకు అడ్డొస్తున్నాననే కరోనా సమయంలో ఓ నిర్మాత నా ఇంటిని కావాలని తగలపెట్టాడు. నన్ను అక్కడినుంచి వెళ్లగొట్టాలని దాడులు చేయించారు.
నిజాలు మాట్లాడితే నిందలా?
నాకు మానసిక పరిస్థితి సరిగా లేదు, పిచ్చి అని ప్రచారం చేసి నన్ను పంపించేయాలని చూశారు. నిజాలు మాట్లాడేవారిపై ఇలాంటి నిందలేస్తారా? కొన్నేళ్లుగా నా ఇంటి విషయంలో నరకం అనుభవిస్తున్నాను. గతంలో కూడా నాపై ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది. ఓసారి టచప్ బాయ్ నా ఇంట్లో నుంచి 15 తులాల బంగారం దొంగతనం చేశాడు. కానీ రివర్స్‌లో నేను అతడిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది పేపర్‌లో వచ్చింది. నేను అతడిపై చేయి చేసుకోలేదు. దీంతో ఆ వార్త రాసిన వ్యక్తిని అమీర్‌పేట చౌరస్తాలో కాలర్ పట్టుకుని కొట్టాను. నాపై ఇలాంటి మచ్చ వేస్తే మా జీవితం ఏం కావాలి?
కాలర్ పట్టుకుని..
షూటింగ్స్‌లో కూడా ఒకటీరెండుసార్లు చేయి చేసుకున్నాను. ఒక ప్రొడక్షన్ మేనేజర్.. ఇప్పుడు ఆయన పెద్ద నిర్మాతయ్యాడనుకోండి.. నేను గదిలో దుస్తులు మార్చుకుంటుంటే డోర్ తీశాడు. నేను వెంటనే వెళ్లి డోర్ లాక్ చేశాను. క్షణం ఆగకుండా తలుపు తడుతూనే ఉన్నాడు. ఏంటని డోర్ తీశాను. అతడు నవ్వుతూ.. ఔట్ డోర్ షూటింగ్‌లో చెట్టు పక్కనే చీర మార్చుకుంటారు.. నేనిక్కడే ఉంటా.. చీర మార్చుకో అన్నాడు. కోపంతో తన్నాను. కాలర్ పట్టుకుని కొడుతూ నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాను' అని గుర్తు చేసుకుంది.
ఏఎన్నార్ సలహా
'సినిమాలో అన్నిరకాల మనుషులుంటారు. ఎవరేమన్నా సరే సెట్‌లో యాక్ట్ చేయడం నేర్చుకో.. కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో.. సర్దుకుని వెళ్లు, అలాగని తప్పు చేయమని చెప్పడం లేదు, సున్నితంగా తప్పించుకుని వెళ్లు అని ఏఎన్నార్ సలహా ఇచ్చారు. కానీ నాకు నిజ జీవితంలో యాక్టింగ్ చేయడం రాలేదు' అని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చింది. కాగా ఈమె.. పరువు ప్రతిష్ట, శ్రీదేవి నర్సింగ్‌హోం, పెళ్లి పందిరి, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం రా, మధ్యతరగతి మహాభారతం.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. బుల్లితెరపై సీరియల్స్ కూడా చేసింది.
చదవండి: పెళ్లయితే సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే రిజెక్ట్ చేశా: హీరోయిన్
Tags : 1