Breaking News

హవ్వ, పెళ్లి కాలేదా? ప్రియురాలి కోసం అబద్ధమాడిన హీరో!

Published on Sun, 03/29/2026 - 12:09

తమిళ హీరో రవి మోహన్‌ ఓపక్క విడాకుల వ్యవహారం, మరోపక్క సింగర్‌ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్‌ రూమర్స్‌తో వార్తల్లో ఉంటున్నాడు. విడాకులు మంజూరవకముందే సింగర్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. అయితే ఏకంగా అతడికి అసలు పెళ్లే కాలేదని చెప్తూ ప్రియురాలి కోసం ల్యాండ్‌ కొన్నట్లు ఓ వార్త కోలీవుడ్‌ టౌన్‌లో వైరల్‌గా మారింది.

ఇంకా పెళ్లవలేదు!
రవి మోహన్‌, కెనీషా ప్రాన్సిస్‌ గోవాలో భూమి కొనుగోలు చేశారట. ఈ ప్రాపర్టీ ఖరీదు రూ.40-42 లక్షలని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్‌ సంబంధిత పత్రాల్లో రవి మోహన్‌.. అన్‌ మ్యారీడ్‌ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్‌ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో.. రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు సిబ్బంది పొరపాటున అన్‌మ్యారీడ్‌ సెలక్ట్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు.

పేరు మార్పు
కాగా రవి మోహన్‌.. ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్‌, అయాన్‌ సంతానం. 2024లో రవి మోహన్‌, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్‌ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్‌ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్‌గా నటించాడు.

చదవండి: నిన్ను నా అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు: విజయ్‌ ఆంటోని

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)