Breaking News

రాజమౌళి మనసు మార్చిన 'ధురంధర్ 2'?

Published on Sat, 03/28/2026 - 21:23

ఈ సీక్వెల్, పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్‌కి రాజమౌళి ఓ రకంగా ఆద్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 'బాహుబలి'తో భారతీయ దర్శకుల్ని ఆశ్చర్యపరిచాడు. భారీ బడ్జెట్ పెట్టి సరైన కంటెంట్ వదిలితే.. వందల వేల కోట్ల వసూళ్లు సాధించొచ్చని చూపించాడు. ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ పాతబడిపోయింది. పుష్ప 2, ధురంధర్ 2 లాంటివి ఒకటో రెండో మాత్రమే బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఈ ట్రెండ్ షురూ చేసిన రాజమౌళి కూడా దీని నుంచి దూరంగా జరగాలనే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు మనసు మారిపోయినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)

రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా 'వారణాసి' చేస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు కూడా. సాధారణంగా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ చేస్తారు. రాజమౌళి మాత్రం తన సంప్రదాయానికి భిన్నంగా హాలీవుడ్‌కి చెందిన పలు మీడియా సంస్థలకు తన టీమ్‌తో కలిసి ఈ పాటికే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులోనే 'వారణాసి' ఒకే సినిమాగా రాబోతుందని రాజమౌళి బల్లగుద్ది చెప్పాడు. కానీ ఇప్పుడు మనసు మారినట్లు అనిపిస్తుంది.

దాదాపు ఏడున్నర గంటల నిడివి ఉన్నా సరే 'ధురంధర్' రెండు భాగాల్ని ప్రేక్షకులు ఆదరించారు. రీసెంట్‌గా రిలీజైన సీక్వెల్‌కి వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇదంతా చూసిన రాజమౌళి.. 'వారణాసి'ని కూడా రెండు భాగాలుగా తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. ఎందుకంటే త్రేతా యుగంలోని రాముడు నుంచి వర్తమాన,భవిష్యత్ కాలాల వరకు ఈ సినిమా కాన్సెప్ట్ ఉంది. ఇదివరకే రిలీజ్ చేసిన వీడియోతో ఆ క్లారిటీ ఇచ్చారు. దీన్నంతటినీ ఒకే భాగంలో చూపించే బదులు రెండు భాగాల్లో చూపిస్తే ఎలా ఉంటుందా అని జక్కన్న ఆలోచిస్తున్నాడట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్‌కి పండగే.

'ధురంధర్' రెండు భాగాల్ని కేవలం మూడు నెలల వ్యవధిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా రిలీజ్ చేద్దామనుకుంటే ఇలా మూడు నాలుగు నెలల గ్యాప్‌లో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తే బెటర్. లేదంటే ఆడియెన్స్  డిసప్పాయింట్ అయ్యే అవకాశముంది. చూడాలి మరి ఏం చేస్తారో?

(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్)

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)