Breaking News

రామ్ చరణ్ బర్త్‌ డే స్పెషల్.. ఇంట్లోనే ప్రత్యేక హోమం

Published on Fri, 03/27/2026 - 18:18

మెగా హీరో రామ్ చరణ్ బర్త్‌ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్‌ సంతోషంతో అభిమాన హీరో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తమ హీరోకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. తన కుమారుడి బర్త్‌ డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్ను చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.

చెర్రీ బర్త్‌ డేను మెగా కుటుంబం ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గ్లోబల్ స్టార్. శ్రీరామనవమి రోజే రామ్ చరణ్ బర్త్‌ డే రావడంతో మెగా కుటుంబంలో ఆనందం మరింత రెట్టింపైంది. రామ్ చరణ్ హోమం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పహిల్వాన్‌గా రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ రోజు రిలీజైన గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

 

Videos

భారత్ పై యుద్ధ ప్రభావం మోదీ అలర్ట్ సీఎంలతో అత్యవసర మీటింగ్

వంట నూనెలకూ యుద్ధం సెగ ఉక్కిరిబిక్కిరి...

CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు

నేను ఆత్మహత్య చేసుకుంటా.. మరో సంచలన వీడియోతో ఆరవ శ్రీధర్ బాధితురాలు

CNG గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల పడిగాపులు

యువకుడు - వివాహిత ఏలూరు ఇంస్టాగ్రామ్ ప్రేమ కధ చివరికి ఏం జరిగిందంటే

విజయవాడ YSRCP ఆఫీస్ లో" శ్రీరామనవమి వేడుకలు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్

ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది

Photos

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)