ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది
Breaking News
తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో
Published on Fri, 03/27/2026 - 12:13
ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే వేరే ఊరికి వెళ్లిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం అనమాట. గత నెలలో ఇలానే హీరో విజయ్ దేవరకొండ-రష్మిక.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వెళ్లి అక్కడ గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అయితే ఇలాంటి హడావుడి ఏం లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
(ఇదీ చదవండి: ‘యూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
ఈ నెల ప్రారంభంలో కావ్య అనే అమ్మాయి తన జీవితంలో ఉందని చెప్పి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయం చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యేసరికి ఇదేదో ఎంగేజ్మెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం కుటుంబాల కలిసిన సందర్భం అని సదరు హీరో చెప్పుకొచ్చాడు. త్వరలో శుభవార్త గురించి, పెళ్లి డేట్ బయటపెడతానని అన్నాడు. ఇప్పుడు ఆ తేదీల గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.
వచ్చే నెల 5వ తేదీన బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య.. హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకోనున్నారు. వచ్చే నెల 29న తిరుపతిలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్నారు. మే 01న హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)
Tags : 1