ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
Breaking News
నా నవ్వు బాగుందని ఆ పాత్ర చేయమన్నారు.. కానీ
Published on Wed, 03/25/2026 - 17:31
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలుగులోనూ అలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవి చూస్తున్న ప్రతిసారి.. వీళ్లు తప్పితే మరెవరు నటించినా అస్సలు సూట్ కాదు కదా అని కచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ ఒకటి. మరీ ముఖ్యంగా ఇందులో ప్రకాశ్ రాజ్, రేలంగి మామయ్యగా జీవించేశాడు. ఇప్పటికీ ఎవరైనా నవ్వుతూ ఉంటే సరదాగా రేలంగి మామయ్య అని ఆటపట్టిస్తుంటారు. అంతలా జనాల్లో వెళ్లిపోయింది. అయితే ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్‌ని తొలుత అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.
(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)
''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఎప్పుడూ నవ్వుతూ ఉంటే పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. నా నవ్వు బాగుంటుందనే విషయాన్ని గుర్తుచేస్తూ నేను చేస్తే బాగుంటుందని అడిగారు. కానీ చేయలేకపోయాను' అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చేయనుందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని అడగ్గా.. అలాంటిదేం లేదని అన్నారు. ఒకవేళ రాజశేఖర్.. రేలంగి మామయ్య పాత్ర చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి!
శర్వానంద్ హీరోగా చేసిన 'బైకర్' మూవీలో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఇది వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్ల సందర్భంగానే చాలా విషయాలని రాజశేఖర్ పంచుకుంటున్నారు. అప్పట్లో ఈయన్ని వెతుక్కుంటూ చాలానే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వచ్చాయి. కానీ పలు కారణాలతో వాటిని వదులుకున్నారు. ఇప్పుడేమో ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి అని ఈయనే టాలీవుడ్ దర్శకనిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
రాజశేఖర్ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని దర్శకులు పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు 'బైకర్'పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇందులో హీరోకి తండ్రి, బైక్ రేసింగ్ కోచ్‌గా కనిపించనున్నారు.
(ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)
Tags : 1