ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
'ఆ అమ్మాయి నా కూతురితో సమానం'.. దురంధర్ నటుడు
Published on Tue, 03/24/2026 - 20:54
దురంధర్‌లో రణ్‌వీర్ సింగ్ రోల్ తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆయనదే. అతని వల్లే ఈ సీక్వెల్ రూ.500 కోట్లు ఎక్కువగా సాధిస్తుందని హీరో సైతం అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు.. జమీల్ జమాలీ పాత్రలో అలరిస్తోన్న నటుడు రాకేశ్ బేడీ. తన పాత్రలో రాకేశ్ అద్భుతంగా నటించారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు.
అయితే తాజాగా దురంధర్ హీరోయిన్ సారా అర్జున్‌ను ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్‌ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం తనను సమర్థించారని కూడా ఆయన పేర్కొన్నారు.
తాజాగా ఈ వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు. సారాపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. తాను కేవలం ఆమెపై ఆప్యాయతతోనే అలా చేశానని తెలిపారుు. కానీ మరో కోణంలో చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పాత్ర పోషించిన సారాతో తండ్రిలాగే ప్రవర్తిస్తానని..సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించేవాడినని బేడీ వివరణ ఇచ్చారు. మాది తండ్రీ, కూతుళ్ల బంధమని తెలిపారు. నా ఆప్యాయతను ప్రజలు గుర్తించలేకపోయారని అన్నారు.
ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.." తన కూతురి పాత్ర పోషించిన సారాతో తన బంధం ఎప్పుడూ ఆప్యాయంగా.. ఒక తండ్రిలాగే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించా. ధురందర్ షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడల్లా ఒక కూతురిలా ఆమెను కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టేవాడిని. ఏం పర్వాలేదు.. చింతించకు.. మనిద్దరం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తామని తనతో చెప్పేవాడిని. అదృష్టవశాత్తూ, కొందరు నన్ను సమర్థించారు కూడా. కానీ ఈ సినిమాతో దక్కిన విజయం చాలా మందికి రాదు' అని అన్నారు.
Tags : 1