Breaking News

మార్కెట్‌లో వార్‌ విధ్వంసం 

Published on Tue, 03/24/2026 - 03:57

ముంబై: ఒకపక్క ‘ఇరాన్‌ వార్, మరోపక్క ‘చమురు ధరల బాంబ్‌’తో దలాల్‌ స్ట్రీట్‌ మరోసారి దద్దరిల్లింది.  డాలర్‌ మారకంలో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి నమోదుచేస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలూ మార్కెట్‌ వర్గాలను కలవరపెట్టాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్‌ 1,837 పాయింట్లు(2.46%) క్షీణించి 72,696 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ 602 పాయింట్లు(2.60%) కుప్పకూలి 22,513 వద్ద నిలిచింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ట్రేడింగ్‌ సమయంలో అమ్మకాల సునామీ వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 1,975 పాయింట్లు క్షీణించి 72,558 వద్ద, నిఫ్టీ 644 పాయింట్లు పతనమై 22,471వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి.

ఇండెక్సులన్నీ నష్టాల్లోనే
అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 5%, మెటల్‌ 4.76%, సరీ్వసెస్‌ 4.70%, ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.39%, కమోడిటీస్‌ 4.35%, ఇండ్రస్టియల్స్‌ 4.05%, క్యాపిటల్‌ గూడ్స్‌ 3.99 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌లు వరుసగా 3.82%, 3.66 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో హెచ్‌సీఎల్‌టెక్‌ 1.83%, పవర్‌గ్రిడ్‌ 1.39%, ఇన్ఫోసిస్‌ 0.28% మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లూ నష్టపోయాయి.

యుద్ధం మొదలయ్యాక రూ.48.29 లక్షల కోట్లు ఆవిరి 
పశి్చమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) ఇన్వెస్టర్లు మొత్తం 15 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.48.29 లక్షల కోట్లు కోల్పోయాయి. సెన్సెక్స్‌ 8,591 పాయింట్లు (10.56%), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58%) నష్టపోయాయి. తాజా గా సోమవారం ఒక్కరోజే రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.414.77 లక్షల కోట్లకు దిగివచి్చంది.

నష్టాలు ఎందుకంటే
హార్మూజ్‌ జలసంధి అంశంపై అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో తాజా యుద్ధ భయాలు మార్కెట్లను కుదిపేశాయి. జలసంధి మూసివేత హెచ్చరికలతో క్రూడ్‌ బ్యారెల్‌ 110 డాలర్లపైకి చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరగడమే కాకుండా, వృద్ధి మందగమన ఆందోళనలు తలెత్తాయి. చమురు దిగుమతుల భారం, ఎఫ్‌ఐఐల భారీ అమ్మకాలతో రూపాయి సరికొత్త కనిష్టాలను తాకింది. యుద్ధం మొదలైన తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు మార్కెట్‌ను మరింత బలహీనపరిచింది.

ఆసియా మార్కెట్లు డౌన్‌..
లాభాల్లోకి యూరప్, యూఎస్‌
పశి్చమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చనే ఆందోళనలతో ఆసియా మార్కెట్ల పతనం కొనసాగింది. ఫలితంగా దక్షిణ కొరియా 7%, చైనా 4%, జపాన్‌ 3.60%, హాంగ్‌కాంగ్‌ 3.54%, తైవాన్‌ 2.50%, సింగపూర్‌ 2.22 శాతం క్షీణించాయి. మన మార్కెట్‌ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనతో పరిస్థితులు తారుమారయ్యాయి. పశి్చమాసియాలో నెలకొన్న ఘర్షణలకు ‘సంపూర్ణ, శాశ్వత పరిష్కారం’ కనుగొనే దిశగా ‘ఫలప్రదమైన చర్చలు’ జరిగినట్లు ట్రంప్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఇరాన్‌ విద్యుత్‌ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న ‘అన్ని రకాల దాడులను అయిదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు’ ట్రంప్‌ ప్రకటించారు. దీంతో యూరప్, అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. జర్మనీ డాక్స్‌ ఇండెక్స్‌ 3%, జర్మనీ సూచీ సీఏసీ సూచీ 2%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1% పెరిగాయి. అమెరికా నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 2.25%, డోజోన్స్‌ 2.50%, ఎస్‌అండ్‌పీ–500 సూచీ 2% లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)