Breaking News

ధురంధర్‌ 2 సక్సెస్‌: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్‌

Published on Mon, 03/23/2026 - 11:00

బ్లాక్‌బస్టర్‌ ధురంధర్‌కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ధురంధర్‌: ద రివేంజ్‌. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అటు సోషల్‌ మీడియాలో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఎందరో సెలబ్రిటీలు దర్శకుడు ఆదిత్య ధర్‌ను, అతడి సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీలో నటించిన అందరికీ మంచి పేరు, గుర్తింపు వచ్చింది. 

28 ఏళ్ల నాటి లేఖ
ఈ క్రమంలో ధురంధర్‌ 2లో మొహమ్మద్‌ ఆలంగా నటించిన గౌరవ్‌ గేరా తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. 1998లో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజుల్లో పేరెంట్స్‌కు రాసిన లేఖను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది నేను 1998 డిసెంబర్‌ 3న మా అమ్మానాన్నలకు రాసిన లేఖ. ముంబైకి వచ్చి అప్పటికింకా నెల రోజులు కూడా కాలేదు. అప్పట్లో ఈమెయిల్స్‌ గట్రా ఏవీ లేవు.. ఇదిగో ఇలా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. 

అమ్మానాన్న థాంక్యూ
ఆ తర్వాత టీవీ, సినిమా, యాడ్స్‌, రేడియో, టిక్‌టాక్‌ రీల్స్‌.. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా ప్రయాణం సాగింది. భగవంతుడు నాపై ఎంతో దయచూపించాడు. ఇదిగో ఇలా ధురంధర్‌లో నటించే అవకాశం.. రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అంటూ లేఖను పంచుకున్నాడు.

లేఖలో ఏముందంటే?
అమ్మానాన్న, ఎలా ఉన్నారు? నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతానికి డబ్బుపరంగా ఏమీ కలిసిరావడం లేదు. కానీ, త్వరలోనే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువే.. ఖర్చు తగ్గించుకునేందుకు నేను స్నేహితుడితో కలిసి ఓ చిన్న గదిలో ఉంటున్నాను. 

ఫోన్‌, కరెంట్‌, గ్యాస్‌, వాటర్‌ బిల్లుతో పాటు భోజన ఖర్చులు కూడా ఇద్దరం పంచుకుంటున్నాం. భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంది. కానీ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నటీనటులు, అభిమానులు మీరు చాలా దూరం వచ్చారు, మీ కథ వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: ద 50 షో.. విన్నర్‌గా శివ్‌ ఠాక్రే.. ప్రైజ్‌మనీ మాత్రం ఎవరికంటే?

Videos

నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..

మళ్ళీ ట్రాక్ తప్పుతోన్న ప్రభాస్..

లంచం తీసుకుంటూ దొరికిన లాజిస్టిక్స్ మేనేజర్

మల్లారెడ్డి.. కబడ్డీ, కబడ్డీ

పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..

రంగస్థలం 2 కి రంగం సిద్ధం

ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!

విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ

మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..

న్యూయార్క్ సిటీలో ఘోర విమాన ప్రమాదం

Photos

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)