అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
'మామయ్య ఎల్లప్పుడు నీ వెంటే ఉంటారు'.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
Published on Sun, 03/22/2026 - 12:05
మంచువారి ఇంట ఇటీవలే శుభకార్యం జరిగింది. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు కూడా పాల్గొన్నారు. తన కోడలి ఓణీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. దేవుడు నాకేమిచ్చాడని అడిగితే.. అందులో మా సిస్టర్ కూడా ఒకరని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆమె నాకు ఎల్లప్పుడు ప్రేమను, ఆప్యాయతను, బలాన్ని ఇస్తుందని రాసుకొచ్చాడు.
మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' దేవుడు నాకిచ్చిన వాళ్లలో మా సిస్టర్ కూడా ఒకరు. ఆమె నాకు నిరంతరం ప్రేమ, ఆప్యాయత, బలాన్ని ఇచ్చింది. తనకు కూడా అదే ప్రేమను తిరిగి ఇవ్వాలన్న కోరిక నాలో ఎప్పుడూ ఉండేది. చిన్నారి విద్యా నిర్వాణ మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. తనకు మామగా నా ప్రయాణం మొదలైంది. విద్యా నిర్వాణకు మామగా ఉండటం కేవలం ఒక బిరుదు కాదు.. అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. తన రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా, ఊహించనంత ప్రేమను ఇవ్వాలని కోరుకునే వ్యక్తిగా మను మామ, అత్త, ధైరవ్, దేవసేన ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటారు. నేను నీకు కనిపించనప్పుడు కూడా సున్నితమైన హృదయంతో ఈ ప్రపంచాన్ని జయించు. నీకు బలంగా, నీకు అండగా, నిశ్శబ్దంగా నీ వెనుక నిలబడతా.. లవ్ యూ నా బంగారు తల్లి ' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.
Tags : 1