పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
Breaking News
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
Published on Sat, 03/21/2026 - 13:52
బిగ్‌బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్‌లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్ వర్మకు ఎస్ చెప్పానంటూ ఫోటోలు షేర్ చేసింది.

సినిమా
ఫిబ్రవరిలో వీరి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండేది.
చదవండి: కోర్ట్ జంట బ్యాండ్ మేళం ట్రైలర్
Tags : 1