Breaking News

దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ

Published on Fri, 03/20/2026 - 18:27

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.

(ఇదీ చదవండి: 'దురంధర్‌-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి')

'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్‌నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇ‍న్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్‌వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్‌లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.

'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్‌తో చేసిన సిక్స్ ప్యాక్‌లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.  

ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ  చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.

(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)

Videos

దేశంలో తొలిసారి మిస్టేక్ అఫ్ ఫ్యాక్ట్ కింద కేసులను కొట్టేశారు

ధురంధర్ 2 చూసి షాక్ అయిన టాలీవుడ్ స్టార్స్.. ఏం అన్నారంటే...

రాజంపేటలో దారుణం వదినపై మరిది లైంగిక దాడి

ప్రమాదం కాదు.. నిర్లక్షమే! అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సంచలన నిజాలు

కూనవరం ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి

నిన్న ₹7,000 పతనం.. ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం ధర!

భువనేశ్వరి భారీ స్కెచ్ బాబు బండారం బయటపెట్టిన జడ శ్రవణ్

మా ఇల్లు కూల్చొద్దు మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల నిరసన

రికార్డులు బద్దలు! ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ సునామి..

బిగ్ అలర్ట్.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు

Photos

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)