Breaking News

అలాంటి సీన్లు చేయమని బలవంతం..: నటి

Published on Sun, 03/15/2026 - 18:38

సల్మాన​ ఖాన్‌ 'వీర్‌' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్‌ ఖాన్‌. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్‌ చేసింది. అయితే హేట్‌ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్‌ ఖాన్‌.

ముందో మాట చెప్పి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. హేట్‌ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్‌ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్‌ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్‌ మహదేవన్‌ అక్సర్‌ 2 సినిమా ఆఫర్‌ చేశారు. అయితే ఇందులో బోల్డ్‌ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్‌ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను. 

చెప్పిందొకటి.. చేసిందొకటి
కానీ, సెట్‌కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్‌ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్‌ ఒకరకంగా చెప్పి షూటింగ్‌ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.

ఎంత అన్యాయం?
నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్‌కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్‌.. నాకు లాభమే లేదు: విజయ్‌ సేతుపతి

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)