Breaking News

76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!

Published on Sun, 03/15/2026 - 12:12

బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్‌లాస్‌ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్‌ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్‌చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్‌ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!

పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్‌ ప్రాక్టీషనర్‌ డాక్టర్‌ సయాజిరావ్‌ గైక్వాడ్‌ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్‌లాస్‌ కోసం వచ్చారని అన్నారు.  సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్‌ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. 

ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి  వాపు, ఎల్‌డీఎల్‌ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్‌డైట్‌ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.

రెండుపూటలా తినడం..
ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.

ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వండి
నిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్‌ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్‌ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను తొలగించారు
తరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.

ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..
నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండి
బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు  చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని,  అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.

రోజుకు 30-40 నిమిషాలు నడవండి
నిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.

స్థిరంగా ఉండండి
బరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్‌ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్‌లాస్‌ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్‌ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్‌ సయాజిరావ్‌ గైక్వాడ్‌. 

 

(చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..)
 

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)