నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు
Breaking News
వడగండ్లా... బండరాళ్లా...
Published on Sat, 03/14/2026 - 16:47
పిల్లలూ...వడగండ్ల వాన అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మన దేశంలో వేసవిలో ఎక్కువ పడుతుంటుంది. చిన్న చిన్న గోలీల వంటి వడగళ్లు (Hailstones) పడుతుంటాయి. కొన్ని చోట్ల ఇంకాస్త పెద్ద వడగండ్లు పడుతుంటాయి. వడగండ్లు ఎందుకు పడతాయి?
వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు.అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం.
ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష
అయితే అమెరికాలోని ఇలినాయిస్లో ఎంత పెద్ద వడగండ్లు పడ్డాయో. ఒక్కోటి పెద్ద రాయంత ఉంది. నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంది. కంకాకీలో 6 అంగుళాల వడగళ్లను గుర్తించారు. రాష్ట్రంలోనే ఒక కొత్త రికార్డు వడగండ్లుగా NWS బుధవారం తెలిపింది. అందుకే వడగండ్ల వానలో చిక్కుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్
(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్)
Tags : 1