పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ
Breaking News
ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె
Published on Sat, 02/28/2026 - 14:57
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుసగా పెద్ద సినిమాల నుంచి తప్పుకుంటూనే ఉంది. స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికా సైడ్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ది వైట్ లోటస్‌లో యాక్ట్ చేసే అవకాశాన్ని కూడా వదిలేసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది.
హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి అవుట్
ది వైట్ లోటస్ నాలుగో సీజన్ కోసం మేకర్స్ దీపికను సంప్రదించారట! అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించాలంటే ఆడిషన్ తప్పనిసరి అని టీమ్ చెప్పిందట. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తనకు ఆడిషన్ ఏంటన్న భావనతో దీపికా ఈ ఛాన్స్‌ను వదిలేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీపిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
అరవడం పెద్ద విషయం కాదు
ప్రశాంతంగా ఉండటమే అన్నింటికంటే గొప్ప వరం. సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడటం పెద్ద విషయం కాదు. దానికి ఎటువంటి శక్తి, బలం అవసరం లేదు. కానీ ఎన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తినా ఏమాత్రం చలించకుండా ఉండటంలోనే అసలైన బలం దాగి ఉంది. మన చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని మనల్ని రెచ్చగొడుతున్నా స్థబ్ధుగా, ప్రశాంతంగా ఉండాలి, భావోద్వేగాలను బయటకు కనిపించనివ్వకూడదు.
ఎప్పుడూ ఏదో ఒక గొడవ
ఎంతో కృషి చేస్తే తప్ప ఇదంతా సాధ్యం కాదు. ప్రశాంతంగా ఉండటం అనేది బలహీనత కాదు. అదొక శక్తి. మనమేంటనేది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి స్పందించాల్సిన పని అంతకన్నా లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, వివాదాలు, అర్థంపర్థం లేని విషయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనం వాటికి చలించకుండా కూల్‌గా ఉండటమే అన్నింటికంటే పెద్ద సూపర్ పవర్ అని దీపికా పదుకొణె రాసుకొచ్చింది.
చదవండి: హీరోలు రిజెక్ట్ చేశారు.. వాళ్ల వల్లే: తాప్సీ
Tags : 1