విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య
Breaking News
నటి రన్యారావు తెచ్చిన బంగారం ఎన్ని కేజీలో తెలుసా..?
Published on Fri, 02/27/2026 - 09:04
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. విదేశాల నుంచి ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు తాజాగా ఈడీ అధికారులు గుర్తించారు. దాని మార్కెట్ రూ.102 కోట్లుగా పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో ఈడీ తమ అభియోగపత్రంలో పేర్కొంది. 2025లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోదా చేయగా ఆమె వద్ద అక్రమంగా రవాణ చేస్తున్న రూ.12 కోట్ల విలువ చేసే బంగారం లభించింది.
దీంతో ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం ద్వారా అక్రమంగా కూడబెట్టిన డబ్బు మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్‌ఐ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. సుమారు 10నెలలకు పైగా పరప్పన అగ్రహార జైల్లో ఆమె ఉంది.బెయిల్ కోసం పలుమార్లు పిటీషన్ పెట్టుకున్నప్పటికీ కోర్టులు కొట్టివేస్తూ వస్తున్నాయి.
రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్‌కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్‌తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. దీంతో అసలుగుట్టు బయటపడింది.
Tags : 1