Breaking News

తొలి మహిళా ఐఏఎస్‌ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..

Published on Thu, 02/26/2026 - 16:44

పితృస్వామ్య విధానం బలంగా ఉన్న రోజుల్లో..ఉద్యోగం చేయడం అంటేనే అతి కష్టమైన, అనితరసాధ్యమైన ఆశయం. అలాంటిది ఈ మహిళ ఏకంగా ఐఏఎస్‌ అవ్వాలనుకుంది. అస్సలు ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఏకైక మహిళ కూడా ఆమెనే కావొచ్చు. పోనీ కష్టపడి ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ సర్వీస్‌లో  ఉత్తీర్ణురాలైనా..కూడా ఎన్ని అవరోధాలంటే..ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గవర్నర్‌ వరకు అందరు ఒక మహిళ ప్రజావసేవలోనా..! అని కనుబిమ్మలు, పెదవులు విరిచారు. పైగా ఆమెకు మరో హోదాని ఎంచుకోమని సూచించేవారు. కానీ ఆమె అచంచలమైన ధైర్యంతో వాళ్లందర్నీ ఒప్పించి మరి..భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి అయ్యింది. పురుషులతో సమానంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తూ..అందరిచేత మన్ననలను అందుకోవడమే గాక..ఇలాంటి అత్యుతన్నపదవిలో పురుషుల కంటే మహిళలే మేటీ అని రుజువు చేసిందామె.

ఆ మహిళే..అన్నా రాజమ్ మల్హోత్రా. కేరళలోని కోజికోడ్‌లో జన్మించిన అన్నా మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది.  చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ (అప్పటి మద్రాస్)లో బి.ఏ. ఆనర్స్ పూర్తి చేసింది. ఆ సమయంలో మహిళలకు కొన్ని వృత్తిపరమైన అవకాశాలు అందుబాటులో ఉండటంతో, అన్నా చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉన్నత డివిజన్‌ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించింది. 1950లో తన ఇంజనీర్ బంధువు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఇంటికి తీసుకువచ్చే వరకు ఆమెకు సివిల్ సర్వీస్‌లో చేరాలనే ప్లాన్స్‌​ ఏమి లేవు. 

చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అంత పెద్ద ఆశయాలు మొదట్లో ఏమిలేవు. పైగా ఆ బంధువు పంపించిన ఆ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ దరఖాస్తు రుసుము రూ. 140లు. అది ఆ సమయంలో ఆమెకు పెద్ద మొత్తమే. అయితే ఆ ఫీజు కట్టేందుకు తన స్నేహితుడి తల్లి ముందుకు వచ్చింది. సరిగ్గా 1952లో ఇంటర్వ్యూ రౌండ్‌లో, అన్నా IAS అధికారిణి కావాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఇంటర్వ్యూ కమిటీ ఆమెకు విదేశీ సేవ కోసం ప్రయత్నించమని సూచించింది. ఎందుకంటే అది మహిళలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతేగాదు ఆఖరికి ఆమె ఏ పోస్ట్‌ ఇవ్వాలన్నిది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది నాయకులకు, అధికారులకు. 

ప్లీజ్‌ ఒక్క అవకాశం ఇవ్వండి..
ఎందుకంటే..భారతదేశ మాజీ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (అప్పటి మద్రాస్) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మహిళలు ప్రజాసేవలో కొనసాగడం ఇష్టం లేదని నిర్మోహమాటం లేకుండా ఆమె ముఖం మీదే చెప్పేశారు. ‘మీరు నాకు అవకాశం ఇవ్వాలి’ అంటూ ఆయన్ను ఒప్పించి మరి ఐఏఎస్‌ అధికారి అయ్యింది అన్నా. 

అయితే బాధ్యతలు తీసుకునే ముందు సైనిక శిక్షణతో సహా గుర్రపు స్వారి, రివాల్సర్‌ ఉపయోగించటం తదితరాలన్ని పురుషులతో సమానంగా శిక్షణ తీసుకున్నారామె. ఆమె మొదటి పోస్టింగ్‌లో తిరుపత్తూరు (తమిళనాడు) సబ్-కలెక్టర్‌గా ఉంది. అన్నా రాజంకు మద్రాస్ కేడర్ కేటాయించారు. తరుచుగా అన్నా పురుష అధికారులతో నిండిన గదిలో ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఒక స్తీకి ఉండాల్సిన కనీస వసతులు ఏమి లేవు అన్నాకి. 

ఆమె ధైర్యం ఏ రేంజ్‌లో ఉండేదంటే..
తమిళనాడులోని డెంకనికొట్టై అడవి నుంచి ఏనుగులు గుంపు దారితప్పి బహిరంగ వ్యవసాయ భూమిలోకి తిరుగుతూ..గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుండేది. దాదాపు 18 మైళ్ళు నడిచిన తర్వాత, జంతువులు హోసూర్ చేరుకున్నాయి. ఆందోళన చెందుతున్న నివాసితులు సహాయం కోసం అన్నా చక్కటి పరిష్కార మార్గం చూపారు. ఏనుగులు శబ్దానికి భయపడతాయి కాబట్టి..పెద్ద శబ్దం వచ్చే వాటితో ఆ ఏనుగుల మందవైపు సాగి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. 

ఆమె ప్లాన్‌ ఫలించి..ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. అయితే ఓ మహిళ అధికారి కావడంతో ఆమె చేసిన ఘనకార్యాన్ని అభినందించకపోగా..తీవ్రమైన అల్లర్లు చెలరేగితే ఆమె అణిచివేయగలదా? కాల్చమని ఆదేశాలు ఇవ్వగలదా?, మత పిచ్చివాళ్ళ దాడిని ఎదుర్కొనగలదా..?. అయినా అస్సలు మహిళకు ఎలా అంతటి అత్యున్నత పదవి ఇచ్చారంటూ విమర్శలు కురిపించారు. వాటిన్నంటిని అన్నా లెక్కచేయలేదు. 

ఇలాంటి ఎన్నో సవాళ్లను తన కెరీర్‌లో అధిగమించి ఉన్నతాధికారుల మన్ననలను అందుకున్నారామె. విద్యుత్‌ సరఫరా దగ్గర నుంచి ముంబైలోని నవా శేవా ఓడరేవు నిర్మాణం వరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారామె. అందుకుగానూ 1989లో అన్నాకు పద్మభూషణ్ లభించింది. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన హోదాలను అలకరించారామె. 

అయినా ఎప్పుడూ కూడా ఆమె తాను ఒక మహిళగా కొన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వమని ఏ సమయంలోనూ అగడలేదామె. అంతేగాదు నియామక సమయంలో కూడా వివాహం జరిగితే మీ సేవ రద్దు చేయబడుతుందనే నిబంధన ఉండేది. దాన్ని కూడా ఆమె అంగీకరించింది. ఎందుకంటే ఆ టైంలో అవివాహిత మహిళలు లేదా వితంతువులు మాత్రమే సేవ రంగంలో ఉండాల్సి వచ్చేది. 

పెళ్లి, కుటుంబం..
అన్నా తన ఐఏఎస్ బ్యాచ్‌మేట్ రామ్ నారాయణ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్నారు. తన వివాహం సామాజిక ప్రతీకారానికి దారితీస్తుందని పూర్తిగా తెలిసినా (వారి మతాలు వేర్వేరు) వెనకడుగు వేయలేదు. వారిద్దరూ 1975లో వాషింగ్టన్, డిసిలో వివాహం చేసుకున్నారు. రామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ స్థాయికి ఎదిగి 1997లో మరణించారు. ఇక అన్నా 2018లో మరణించారు. 

ఆమె ఆనాడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు ఇవాళ ఎంతోమంది మహిళామణులు ఐఏఎస్‌లు అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. ఆమె మొదట ఈ అత్యున్నత పదవిలోకి వచ్చేటప్పుడూ..మొత్తం దారి చాలా కఠినంగా ఇరుకుగా ఉంది.. ఇప్పుడది..పువ్వులతో పరిచి అందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా మారింది. 

(చదవండి: ఆ కమెడియన్‌కి వెయిట్‌లాస్‌ మందులు అస్సలు పనిచేయలేదు..! కారణం అదేనా..)
 

#

Tags : 1

Videos

టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి

ఇకపై ఫారిన్ వెళ్లక్కర్లేదు..! వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లోబల్ టెక్నాలజీ

బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు

జెరూసలెంలో మోదీ.. 11 కీలక ప్రకటనలు

కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది

భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్

పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు

Tatiparthi Chandrasekhar : వెలిగొండలో బాబు క్యాట్ వాక్, ర్యాంప్ వాక్

తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స

అన్నింటికి సిద్దపడే జైలుకు వెళ్ళా... కానీ పొన్నవోలు మాత్రం అంబటి ప్రశంసలు

Photos

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)