Breaking News

'వారణాసి' స్టోరీ లీక్ చేసిన ప్రియాంక చోప్రా!

Published on Thu, 02/26/2026 - 10:34

మహేశ్-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. చాన్నాళ్లుగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ.. గతేడాది నవంబరులో ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది. రాజమౌళి మూవీస్ కచ్చితంగా అనుకున్న తేదీకి రావనే అపవాదు ఉంది. ఈసారి మాత్రం కచ్చితంగా అలా జరగదనే అనిపిస్తుంది. అది నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే ఉంది. ఈ మూవీలో నటిస్తున్న ప్రియాంక చోప్రా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది.

సినిమా రావడానికి ఇంకా ఏడాది టైమ్ ఉన్నప్పటికీ.. గత నెలలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, దర్శకుడు రాజమౌళి.. పలు హాలీవుడ్ హ్యాండిల్స్‌కి ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు రిలీజయ్యాయి. వీటిలో రాజమౌళి కొన్ని విషయాలు పంచుకున్నారు. మహేశ్ బాబు, రాముడి పాత్రలో దాదాపు అరగంట పాటు కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా మరికొన్ని అంశాలతో పాటు స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేసింది.

(ఇదీ చదవండి: #Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్)

'వారణాసి' చూస్తున్నంతసేపు మనం కాలంతో పాటు ప్రపంచమంతా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీ అత్యుత్తమ టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా నిలుస్తుంది. ఇప్పటికే 14 నెలల పాటు షూటింగ్ జరిగింది. మరో 6 నెలలు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుంది అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఈమె నటించిన 'ద బ్లఫ్' అనే ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. దీని ప్రమోషన్లలో భాగంగానే ప్రియాంక మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకుంది.

'వారణాసి' మొదలైనప్పుడే గ్లోబ్ ట్రాటెర్ అనే పేరు వైరల్ అయింది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ వీడియో, ప్రియాంక చెప్పిన మాటల బట్టి చూస్తుంటే ఇది ఇంట్రెస్టింగ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అని క్లారిటీ వచ్చేసింది. ఇందులో రుద్ర అనే పాత్రలో మహేశ్ బాబు, మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ అనే ప్రతినాయక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న 'బిగ్‪‌బాస్ 8' విజేత నిఖిల్)

Videos

Komarada Nagavali River:ఇంటర్ విద్యార్థులకు నది దాటడమే ఓ పరీక్ష

మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్

సేతుపతి, సాయి పల్లవితో మణిరత్నం లవ్ స్టోరీ

సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు

Hyd: షాపింగ్ మాల్‌కు టెంపుల్ సెట్ వేయడంతో భారీగా వ్యాపించిన మంటలు

9 ఏళ్ల బాలికకు హార్ట్ ఎటాక్! ప్లే గ్రౌండ్ లో కుప్పకూలి చనిపోయిన చిన్నారి

రఘురామను అరెస్ట్ చేయాలి.. IPS PV సునీల్ కుమార్ సంచలన ట్వీట్

Nellore: కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠంపై సుప్రీంకోర్టు సీరియస్

లడ్డూపై చర్చ జరుపుతామని మాట మార్చిన ప్రభుత్వం

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)