Good News: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. అధిక పెన్షన్ పునరుద్ధరణ
Breaking News
'కోర్ట్' సినిమా టైంలోనే చదువు ఆపేశాను
Published on Wed, 02/25/2026 - 12:43
కొన్నిరోజుల క్రితం శ్రీలీల.. డాక్టర్ కోర్స్ పూర్తి చేసి పట్టా అందుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓవైపు వరస సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎలాగోలా చదువు పూర్తి చేసింది. అయితే నటిస్తూ చదువుకోవడం అంటే అందరికీ కుదరకపోవచ్చు. ఇప్పుడు అలా వీలుకాకపోవడంతో 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి చదువు ఆపేసింది. ఈ విషయాన్ని ఆమెనే తాజాగా బయటపెట్టింది.
(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)
తెలుగమ్మాయి అయిన శ్రీదేవి.. గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. సోషల్ మీడియాలో కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా దర్శకుడు రామ్ జగదీష్ దృష్టిలో పడి 'కోర్ట్' మూవీలో లీడ్ రోల్ అవకాశం దక్కించుకుంది. గతేడాది ఇదే టైంకి రిలీజైన ఈ చిత్రం.. బ్లాక్బస్టర్ హిట్ అయింది. దీంతో శ్రీదేవి దశ తిరిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో హీరోయిన్గా పలు మూవీస్ చేస్తోంది. ఈమె నటించిన 'బ్యాండ్ మేళం' మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.
ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లోనే శ్రీదేవి చదువుతున్నావా? లేదా? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. 'కోర్ట్' సినిమాలో నటిస్తున్న టైంలోనే చదువు ఆపేశానని, ప్రస్తుతం డిస్టెన్స్ విధానంలో చదువుతున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె డిగ్రీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో హీరోయిన్గా 'హైకూ' చిత్రంలో నటిస్తోంది. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.
(ఇదీ చదవండి: 'ఆయా షేర్' పాట.. నా స్టెప్ కాపీ కొట్టేశారు)
Tags : 1